twitter

    యశోద స్టోరి

    యశోద సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత రూత్ ప్రభు, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, మధురిమా, దివ్య శ్రీపాద తదితరులు నటించారు. ఈ సినిమాకి దస్తకత్వం హరి శంకర్, హరీష్ శంకర్ కలిసి వహించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సాగనీతం మని శర్మ అందించారు.  

    కథ
    తల్లిదండ్రులు లేని యశోద (సమంత రుత్ ప్రభు) తన సోదరి బృంద (ప్రీతి అస్రానీ)ను సొంత బిడ్డలా పెంచుతుంది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకొనే ప్రియకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరం ఏర్పడుతుంది. చెల్లెల్ని రక్షించుకోవడానికి అవసరమయ్యే డబ్బు కోసం అద్దె గర్భం (సరోగసి) ద్వారా బిడ్డను కనేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మిస్ ఇండియా అనుమానాస్పదంగా మరణిస్తుంది. సరోగసికి సిద్దమైన యశోదకు హాస్పిటల్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? యశోదతోపాటు ఫెసిలిటిలో ఉన్న లీలా (దివ్య శ్రీపాద), తేజు (కల్పిక) ఇతర మహిళలకు ఎదురైన సమస్యలు ఏమిటి? లీలాకు జరిగిన అన్యాయాన్ని యశోద ఎలా స్పందించింది? యశోదకు ఫిసిలిటీ నిర్వాహకురాలు మధుబాల (వరలక్ష్మీ శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని కృష్ణన్) ఎందుకు ఎదురు తిరిగారు? సరోగసి ఫెసిలిటీకి కేంద్ర మంత్రి (రావు రమేష్)కు సంబంధమేమిటి? మిస్ ఇండియా మరణం కేసును పోలీసుల ఆఫీసర్లు (శత్రు, సంపత్ రాజ్) ఎలా దర్యాప్తు చేశారు. యశోదకు, పోలీసుల దర్యాప్తుకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నకు సమాధానమే యశోద సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie యశోద with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X