ఎటో వెళ్ళి పోయింది మనసు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సమంత, కృష్ణుడు, విద్యు, అనుపమ, శ్వేత తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్వహించారు మరియు నిర్మాతలు సి కళ్యాణ్, గౌతమ్ మీనన్ కలసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు.
కథ
వరుణ్ కృష్ణ (నాని),నిత్య(సమంత)చిన్ననాటి స్కూల్ ప్రెండ్స్... తర్వాత కాలేజ్ మేట్స్.... ఆ తర్వాత సోల్ మేట్స్... అయితే ఇద్దరూ తమ తమ ఇగోలతో ఎప్పుడూ ఘర్షణ పడుతూంటారు. దానికి తోడు.. వరుణ్ ది మిడిల్ క్లాస్ ప్యామిలీ.. నిత్యది డబ్బున్న కుటుంబం. దాంతో నిత్య తండ్రి ...ఆర్దికంగా వ్యత్యాసమున్న తమతో సంభంధం ఒప్పుకోకపోతే తమ కుటుంబం అవమానానానికి లోనవుతుందని వరుణ్ భయపడి, ఆమెకు దూరం జరిగి తన కెరీర్ పై దృష్టి పెడతాడు. ఇది భరించలేని నిత్య...కోపంతో...భాథతో అతనికి దూరం అయ్యి వేరే వ్యాపకంలో పడుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి వరుణ్ తను ఆమెను మర్చిపోలేనని వెనక్కి వచ్చినా ఆమె ఏక్సెప్టు చెయ్యదు. తిట్టి పంపుతుంది. అప్పుడు వరుణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోసుకుని,సెటిల్ అవటానికి సిద్దపడతాడు. ఆ విషయం చివరి నిముషాల్లో తెలుసుకున్న నిత్య ఏం చేసి,తన ప్రేమను గెలిపించుకుంది అనే విషయం తెరపైనే చూడాలి.