Chennai Love Story సక్సెస్‌కు కారణాలు ఏమిటి? చెన్నై లవ్ స్టోరీ మూవీని ఎందుకు చూడాలంటే?
యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతున్నది. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేశ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రానికి క్రిటిక్స్, కామన్ ఆడియెన్స్ ఆదరించడంతో భారీ విజయం వైపు పరుగులు పెడుతున్నది. సహ నిర్మాతగా ధీరజ్ మొగిలినేని వ్యవహరించిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రవి నంబూరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మణిశర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రవి నంబూరి, కథ: సాయి రాజేశ్, సినిమాటోగ్రఫి: విశ్వాస్ డేనియల్, ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్, లిరిక్స్: అనంత శ్రీరాం అందించిన సేవలు ప్రామాణికంగా నిలిచి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. అయితే ఈ సినిమాను ఇష్టపడి చూడటానికి కనీసం 5 పాయింట్స్ గురించిన వివరాల్లోకి వెళితే..

స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్
చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ప్రధానంగా ట్రాయంగిల్ లవ్ స్టోరీని రాసుకొన్న విధానం బాగుంది. కొత్త పాయింట్‌తో పాత్రలను డిజైన్ చేసిన తీరు ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమాకు ఫస్టాఫ్ ప్రాణంగా ఉంటుంది. సన్నివేశాలను పేర్చిన విధానం సినిమాకు బలంగా మారింది. ఈ మూవీ మొదటి భాగాన్ని డీల్ చేసిన తీరు, అలాగే ప్రతీ సన్నివేశంలోను ఎమోషన్స్‌ను నింపడమే కాకుండా తెరపైన పండించడం ఈ సినిమా ఆకట్టుకొనేందుకు దోహదపడింది.
డైరెక్షన్, రైటింగ్
తొలి చిత్ర దర్శకుడిగా రవి నంబూరి, కథను అందించిన సాయి రాజేష్ మధ్య కోఆర్డినేషన్ చక్కగా వర్కవుట్ అయింది. దర్శక, రచయితల తమ విజన్‌ను తెర మీదకు తీసుకొచ్చి.. కథను నడిపించిన తీరు గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌లో ముగింపులో షాకింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ఆలోచనలకు పదునుపెట్టారు. సెకండాఫ్‌లో దర్శకుడు ఎలా డీల్ చేస్తాడనే అనుమానానికి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేలా సినిమాను నడిపించడం ప్లస్ పాయింట్‌గా మారింది.
మణిశర్మ మ్యూజిక్
చెన్నై లవ్ స్టోరి సినిమా విజయంలో మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. చాలా రోజుల తర్వాత మణిశర్మ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో విశ్వరూపం చూపించారు. ప్రేమ కథకు కావాల్సిన పాటలను భావోద్వేగంతో రూపకల్పన చేశారు. మణి విజన్‌కు తగినట్టుగానే అనంత శ్రీరామ్ ఎమోషన్స్ భారీగా పండేలా లిరిక్స్ అందించారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలోని సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసేందుకు ఉపయోగపడ్డాయి.
శ్రీ గౌరీ ప్రియ, కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్
ఈ సినిమాను నెక్ట్స్ రేంజ్‌లోకి తీసుకెళ్లడానికి హీరో, హీరోయిన్లు శ్రీ గౌరీ ప్రియ, కిరణ్ అబ్బవరం ప్రాణం పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. లేడీ అర్జున్ రెడ్డి అంటూ ప్రేక్షకులు, నెటిజన్లు గౌరీ ప్రియ పెర్ఫార్మెన్స్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్లలో గౌరీ ప్రియ యాక్టింగ్ పీక్స్. ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంలో కొత్త నటుడిని చూస్తాం. ఇప్పటి వరకు డిఫరెంట్ రోల్స్ చేసిన ఆయన ఈ సినిమా ద్వారా పరిపూర్ణమైన యాక్టర్‌గా కనిపిస్తాడు. ఈ ఇద్దరు తెరపైన పోటీపడి నటించడం ద్వారా ఆడియెన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందించారనే చెప్పాలి.
ఫ్రొడక్షన్ వాల్యూస్
ఎమోషనల్, డిఫరెంట్ లవ్ స్టోరికి కావాల్సిన సాంకేతిక విభాగాల కూర్పు చక్కగా ఉందనే అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫి ఎక్సలెంట్‌గా ఉంటుంది. చెన్నై, ఇతర ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు కథకు బలంగా మారాయి. భాస్కర్ అందించిన ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు ఫ్రెష్‌నెస్ తెచ్చిపెట్టింది. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుండటం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌గా మారాయని చెప్పవచ్చు. నిర్మాతలు అనుసరించిన నిర్మాణ విలువలు, నటీనటుల ఎంపిక ఈ సినిమా సక్సెస్‌కు కారణమయ్యాయని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications



