ఇండస్ట్రీలో మరోసారి కలకలం.. అప్పుడు సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ఆమిర్ ఖాన్!

బాలీవుడ్‌లో మరోసారి కలకలం రేగింది. గత కొన్నేళ్లుగా నటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. పలు దాడికి ప్రయత్నించినట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. ఇక తాజాగా మరో స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోని ఓ పోస్టులో ఆమిర్ ఖాన్‌ను బెదిరింపులకు పాల్పడుతూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఆ పోస్టు ప్రామాణికతపై ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు. అసలేం జరిగిందంటే..?

Also Read
బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!
బిగ్ సర్‌ప్రైజ్.. ప్రియాంక పాత్రపై రాజమౌళి క్లారిటీ.. అంచనాలు పెంచేశారుగా!

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సంబంధించిన ఓ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఆమిర్ ఖాన్‌ను హెచ్చరిస్తూ బెదిరింపు సందేశం ప్రచారంలోకి వచ్చింది. అయితే, ఈ పోస్టును ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. ముంబై పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ లేదా ఆయన బృందం నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

Recommended For You
100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
100 కోట్లు ఆషామాషీ కాదు.. సమంతపై ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
After Salman Khan Aamir Khan Faces Alleged Threat Linked to Lawrence Bishnoi Gang

వైరల్ అవుతున్న ఈ పోస్టులో.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పబడుతున్న అర్జూ బిష్ణోయ్, అలాగే టైసన్ బిష్ణోయ్ పేర్లు ఉన్నాయి. ఆ పోస్టులో ఆమిర్ ఖాన్ దేశంలో "లవ్ జిహాద్"ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ, అలాంటి చర్యలను తాము సహించబోమని పేర్కొన్నారు. అలాగే "దీనికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అంటూ హెచ్చరించారు.

You May Also Like
Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ
Sreemukhi: శ్రీముఖికి పెళ్లి కళ.. అలాంటి వాళ్ల కోసమే ఇన్నాళ్లూ అంటూ

అయితే ఈ పోస్టు నిజంగా ఆ వ్యక్తులే చేశారా? లేదా ఎవరో వారి పేర్లను ఉపయోగించి కలకలం సృష్టించారా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ బెదిరింపులు ముంబై పోలీసులకు ఫేస్‌బుక్ పోస్టు, ఒక వాయిస్ నోట్ ద్వారా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాటి ప్రామాణికతను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఆమిర్ ఖాన్ లేదా ఆయన ప్రతినిధుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే చట్టపరమైన చర్యలు తీసుకుని అవకాశముందని పోలీసు వర్గాల సమాచారం.

లెనిన్ హిట్‌తో అఖిల్ పుల్ జోష్.. అనిల్ రావిపూడికి స్టేజ్‌పైనే బంపర్ ఆఫర్!
లెనిన్ హిట్‌తో అఖిల్ పుల్ జోష్.. అనిల్ రావిపూడికి స్టేజ్‌పైనే బంపర్ ఆఫర్!

సల్మాన్ ఖాన్ తర్వాత ఆమిర్?
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వినగానే ఎక్కువగా గుర్తుకు వచ్చేది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్. గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్‌కు ఈ గ్యాంగ్ నుంచి వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో సల్మాన్‌పై బిష్ణోయ్ వర్గానికి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి.

పెళ్లికి ముందే సహజీవనం.. టెలివిజన్ యాక్టర్లకు నెటిజన్ల వేధింపులు..
పెళ్లికి ముందే సహజీవనం.. టెలివిజన్ యాక్టర్లకు నెటిజన్ల వేధింపులు..

గతంలో పలుమార్లు వెల్లడైంది. 2018లో కోర్టుకు హాజరైన సమయంలో కూడా లారెన్స్ బిష్ణోయ్ "సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్‌లో చంపుతాం" అంటూ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం సల్మాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు గతంలో ప్రకటించింది. మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో కూడా ఈ గ్యాంగ్ పేరు వినిపించింది.

రెమ్యూనరేషన్ పెంచిన భాగ్య‌శ్రీ భోర్సే.. లెనిన్ హిట్ తర్వాత పారితోషికం ఎన్ని కోట్లంటే?
రెమ్యూనరేషన్ పెంచిన భాగ్య‌శ్రీ భోర్సే.. లెనిన్ హిట్ తర్వాత పారితోషికం ఎన్ని కోట్లంటే?

ఈ వైరల్ పోస్టుపై ఆమిర్ ఖాన్ లేదా ఆయన బృందం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ పోస్టుపై ఫిర్యాదు కూడా నమోదు చేయలేదు. అందువల్ల ఈ వ్యవహారంలో ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు నిజమైనదేనా? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. కాబట్టి ఈ వ్యవహారంలో అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X