Brahmamudi:ప్రెగ్నెన్సీ నాటకం బట్టబయలు.. కావ్య, స్వప్న దుగ్గిరాల ఇంటి నుంచి ఔట్?
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం.
అక్టోబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో కనకం చీరలకు రుద్రాణి బొక్కలు పెడుతుంది. అది చూసిన కనకం.. నా చీరలు ఇలా చినిగాయని బోరున విలపిస్తుంది. అవి ఎలుకలు చేసిన పని వదినా అంటూ రుద్రాణి నాటకం ఆడుతుంది. ఇక కనకం ఆ ఎలుకలను బండ బూతులు తిడుతుంది. మరోవైపు అనామిక, కల్యాణ్.. ఫోటోస్ దింపడానికి అప్పును తీసుకువెళ్తారు. వాళ్ల ఫోటోలు దించమని అప్పుకి చెప్తారు. ఇక అప్పు వారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్ లో స్వప్నకు ప్రెగ్నెన్సీ మందులను కనకం తెచ్చిఇస్తుంది. కడుపు లేకుండా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని.. వేసుకోడానికి స్వప్న ఇష్టపడదు. అయితే టాబ్లెట్ వేసుకునేదాక కనకం ఊరుకోదు. దాంతో స్వప్న చచ్చినట్లు ఆ టాబ్లెట్ వేసుకుంటుంది. కనకం వెళ్లగానే.. వామిట్ చేసుకుని.. టాబ్లెట్‌ని బయటికి కక్కేస్తుంది. మరోవైపు కావ్య.. ఇంట్లో పని మనిషి గురించి పెట్టడం తప్పు కాదు కానీ.. అత్తయ్యగారికి నచ్చని పని మనిషిని పట్టడం కరెక్ట్ కాదు. ఆమెని పంపించేయండి.. నేను ఎలాగో పడతాను' అంటుంది. అలా కుదరదు మామ్‌తో నేను మాట్లాడతాను అని రాజ్.. అపర్ణదేవి గదిలోకి వెళ్తాడు. నీ భార్య మీద ప్రేమ ఉంటే ప్రేమ చూపించు.. అందరిలో నన్ను పిచ్చి దాన్ని చేయకు.. కన్న తల్లినే కానీ నీ మనసు ఏంటో నాకు అర్థం కావట్లేదు.. దయచేసి వెళ్లిపో' అంటుంది.
అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్ లో రాజ్ తో కావ్య ప్రేమగా మాట్లాడుతుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇంతలో ఇందిరాదేవి పాల గ్లాసు ఇచ్చేందుకు వస్తుంది. ఇక పరుపు చూస్తే.. పరువు పోతుందని ఆ పరుపును బాల్కనీ నుంచి విసిరేస్తాడు రాజ్. అది ప్రకాశం మీద పడిపోతుంది. ఇక ఇంట్లో అందరూ ప్రకాశం కనిపించడం లేదని బాధపడుతారు. ధాన్యలక్ష్మి బోరున ఏడుస్తుంది. నేనుతీసుకువస్తాను అని రాజ్ వెళ్తాడు. అక్కడ ప్రకాశం స్రృహా కోల్పోయి ఉంటాడు. ఇక బాబాయిని లేపి ఇంటికి తీసుకు వస్తాడు. ఆ తర్వాతి ఎపిసోడ్ ఏం జరిగింది ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
అక్టోబర్ 26వ తేదీ ఎపిసోడ్ లో కావ్య తన బెడ్ కావాలి అని అడుగుతుంది. బెడ్ లేదు.. తన బెడ్ మీద పడుకోమంటాడు. ఇక నిద్రపట్టక కావ్య పాటలు పెట్టుకుంటుంది. ఇక ఆ పాటలు ఫోన్ లో ఆపుదామని రాజ్ .. కావ్య దగ్గరకు వెళ్తాడు. అది చూసి కావ్య కేకలు వేస్తుంది. మరోవైపు కళ్యాణ్ ప్రేమలోంచి బయటకు రాలేక అప్పు బాధ పడుతుంది. అప్పుడే కల్యాణ్ ఫోన్ చేసి.. మా ఫోటోల్లో బెస్ట్ ఫోటోస్ సెలెక్ట్ చేయమంటాడు. ఇక అవి చూసి అప్పు డిలీట్ చేస్తుంది. అప్పుడే కృష్ణ మూర్తి వచ్చి ఎందుకు డిలీట్ చేస్తున్నావని అడుగుతాడు. కానీ అప్పు కొత్తగా మాట్లాడుతుంది. ఇక కృష్ణ మూర్తి ఏమైంది దీనికి అనుకుంటాడు. ఇక తర్వాతి ఎపిసోడ్ ఏం జరిగింది ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా స్వప్న సీమంతం గురించి మాట్లాడుకుంటారు. స్వప్న సీమంతం బాధ్యతలను కావ్యకు ఇస్తుంది ఇందిరాదేవి. ఇంట్లో వాళ్లకు నిజం చెప్పాలని కావ్య అనుకుంటుంది. ఇక స్వప్న వద్దని చెప్తుంది. మరోవైపు ఇంట్లో వాళ్ల సంతోషం చెడగొట్టడం ఇష్టం లేక కావ్య సైలెంటుగా ఉంటుంది. ఇక స్వప్న కడుపు పొగొట్టేందుకు రుద్రాణి మాస్టార్ స్కెచ్ వేస్తుంది. జ్యూస్ లో ట్యాబ్లెట్స్ కలుపుతుంది. ఇక తర్వాతి ఎపిసోడ్ ఏం జరిగింది ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
అక్టోబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ తాగిన స్వప్నకు ఏమి కాకపోవడంతో.. రాహుల్ ఆశ్చర్యపోతాడు. స్వప్నను లేపి.. ఏమైనా కావాలా అని అడుగుతాడు. ఒక డైమండ్ నెక్లస్ కావాలి.. కొనిస్తావా అంటూ స్వప్న వెటకారంగా అంటుంది. ఇక రుద్రాణి డాక్టర్ కు ఫోన్ చేసి అడుగుతుంది. అవి కచ్చితంగా కడుపు పోయే ట్యాబ్లెట్స్ అని చెప్తుంది. ఇక స్వప్నకు కడుపు లేదనే విషయాన్ని రుద్రాణి తెలుసుకుంటుంది. ఇక తర్వాతి ఎపిసోడ్ ఏం జరిగింది ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి


Click it and Unblock the Notifications











