Brahmamudi: కావ్యకు షాక్ ఇచ్చిన రాజ్... అనామిక ప్రేమలో కల్యాణ్.. ప్రెగ్నెన్సీ కోసం స్వప్న పాట్లు
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
సోమవారం ఆగస్టు 28న బ్రహ్మముడి సీరియల్ లో కావ్య కంగారు టీ పెట్టి తీసుకొచ్చి అందరికీ ఇవ్వబోతుంది. కానీ ఎవరూ తీసుకోరు. ఆ తర్వాత అపర్ణకు టీ తీసుకెళ్లి ఇస్తుంది కావ్య. వెంటనే అపర్ణ.. ధాన్యలక్ష్మి ఈరోజు నుంచి మన ఇంటి పనులు మనమే చేసుకోవాలని చెప్పాను కదా.. ఇలా అడ్డమైన వాళ్లందరూ వచ్చి నాకు టీ ఇస్తే తీసుకోవాలా.. అంటూ సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంటే ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నారన్నమాట అని కావ్య ఫీల్ అవుతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ బైక్ ను వేలం పాట పెడుతుంది. దీంతో జనాలందరూ ఎగబడతారు. అలా ఆసక్తిగా ఎపిసోడ్ సాగింది.

ఆగస్టు 29న ఎపిసోడ్ లో ఎంతో ఆసక్తికరంగా సాగింది. కావ్య ఇంట్లోకి వచ్చినా తనతో ఎవరూ మాట్లాడరు. దీనితో ధాన్యలక్ష్మితో కలిసి ఓ ప్లాన్ వేస్తుంది. మరోవైపు కావ్య పొట్ట పెంచుకునేందుకు బిర్యానీ తింటుంది. ఆ తర్వాత వాంతులు చేసుకుంటుంది. అది చూసిన ఇందిరా దేవి.. అపర్ణ, రాహుల్ కు తనను ఆసుపత్రిలో చూపించమంటూ చెబుతుంది. ఇక తనకు కడుపు లేదనే విషయం తెలిపోతుందా అని స్వప్న టెన్షన్ పడుతుంది. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి
ఆగస్టు 30న ఎపిసోడ్ లో బ్రహ్మముడి ధారావాహిక ఈరోజు కూడా మంచి ట్విస్టులతో సాగింది. ఇక కావ్యతో ఎవరూ మాట్లాడకూడదని అపర్ణ పెట్టిన కండిషన్ ను ఇందిరాదేవి బట్టబయలు చేస్తోంది. అపర్ణ నిర్ణయాన్ని సుభాష్, సీతారామయ్య ఇద్దరూ తప్పుబడతారు. ఇక మరోవైపు స్వప్నను తీసుకుని రాహుల్, రుద్రాణి ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అక్కడ స్వప్న ప్రెగ్నన్సీ అబద్ధం అని బయటపడిందా? పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి
ఆగస్టు 31న ఎపిసోడ్ లో కావ్యకి అత్త వేసిన శిక్ష గురించి అందరికీ ఇందిరా దేవి చెబుతుంది. ఇక స్త్రీ సంఘం వాళ్ళు రాజ్, కావ్యకి సన్మానం చేస్తారు. కళావతి సంతోషంగా మొగుడు చేతిని పట్టుకుని మరీ ఫోటో దిగి సంబరపడిపోతుంది. కావ్య చేసిన మంచి పని ఇంట్లో కొంతమందికి నచ్చలేదు కానీ అదే ఈ కుటుంబానికి పేరు తీసుకొచ్చిందని సుభాష్ అపర్ణకి తగిలేలా సెటైర్ వేస్తాడు.పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి

సెప్టెంబరు 1న ఎపిసోడ్ లో కల్యాణ్ వీర అభిమాని అనామిక కోసం ఓ హోటల్ కు వెళ్తాడు. ఇక అక్కడున్న స్టాఫ్ అంతా.. కల్యాణ్ కు వెల్ కమ్ చెబుతారు. అనామిక బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంటాడు కల్యాణ్. ఇంతలో ఓ చిన్న అమ్మాయి రోజా పూవ్వుతో వస్తుంది. ఈమె అనామికనా అని టెన్షన్ పడుతాడు.. మేడమ్ వస్తున్నారు అని చెప్పి రోజ్ ఫ్లవర్ ఇచ్చి వెళ్లిపోతుంది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఓ ఆంటీ, ఆ తర్వాత మరో బామ్మ.. ఇలా వచ్చి... పువ్వు ఇచ్చిపోతారు. కల్యాణ్ మాత్రం అనామిక వీరేనేమో అని టెన్షన్ పడుతూ.. కాదని తెలుసుకున్నకా కూల్ అవుతూ ఉంటాడు. పూర్తి ఎపిసోడ్ కోసం క్లిక్ చేయండి
సెప్టెంబరు 2న ఎపిసోడ్ లో కావ్య ఎంతో శ్రద్ధతో వరలక్ష్మివ్రతం చేస్తుంది. ఆమె తల్లి, అప్పు కూడా వస్తారు. ఇక పాటలు పాడి... వరలక్ష్మి వ్రతాన్ని ముగిస్తారు. ఇక అక్షింతలు వేసి.. భార్యను ఆశీర్వదించాలని పూజారి చెబుతాడు. కానీ రాజ్ మాత్రం ఆశీర్వదించ కుండా అక్షింతలు పడేసి వెళ్తాడు. దీనితో కావ్య ఆశ్చర్యపోతుంది. లోపలికి వెళ్లిన రాజ్ ను ప్రశ్నిస్తుంది.. నిన్ను ఎప్పటికీ భార్యలా అంగీకరించను అని చెప్తాడు రాజ్.


Click it and Unblock the Notifications











