Brahmamudi : సీరియల్‌లోకి మరో హీరో ఎంట్రీ.. కావ్య దెబ్బకు రాజ్ విలవిల.. వారం మొత్తం ట్విస్టులే!

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈ వారం మొత్తం ట్విస్టులతో సాగింది. కావ్యను వదిలించుకునేందుకు రాజ్.. శ్వేతతో కలిసి విడాకులు, పెళ్లి అంటూ నాటకం మొదలు పెట్టాడు. ఈ నాటాకానికి కావ్య కూడా కొత్త డ్రామా మొదలుపెడుతుంది. రాజ్ కు సర్ ప్రైజ్ అంటూ కావ్య ఆటపట్టిస్తుంది. కావ్య జీవితంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. మరోవైపు అనామిక, రుద్రాణి కలిసి ప్లాన్స్ వేస్తుంటారు. ఇటు కల్యాణ్ అనామికతో శోభనం కోసం ఆఫీసుకు బయలుదేరుతాడు. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు బ్రహ్మముడి సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

ఫిబ్రవరి 12వ తేదీ ఎపిసోడ్ సీరియల్‌లో శ్వేతకు విడాకులు వచ్చాయని రాజ్ పార్టీ చేసుకోవాలనుకుంటాడు. ఆఫీసుకు రాకుండా శ్వేతతో కలిసి బయటకు వెళ్తాడు. మరోవైపు ఆఫీసులో క్లైంట్స్ రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రాజ్ కు కావ్య కాల్ చేసిన కట్ చేస్తాడు. దీంతో సుభాష్.. కావ్యతో క్లైంట్స్ కు మీటింగ్ అరెంజ్ చేస్తాడు. దీంతో కావ్య సక్సెస్ ఫుల్ గా మీటింగ్ అటెండ్ అవుతుంది. ఇక రాజ్ ఆఫీసుకు శ్వేతతో కలిసి వస్తాడు. ఆమె ఎవరు ఏంటి అని సుభాష్ ప్రశ్నలు వేస్తాడు.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 February 12th to February 17th episode

ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ సీరియల్లో అనామిక, రుద్రాణి కలిసి కావ్య మీద దొంగతనం మోపేందుకు ప్లాన్ వేస్తారు. ఇంట్లో రెండు లక్షలు మిస్ అయ్యాయని చెప్పి.. కావ్యనే తీసుకుపోయిందని ధాన్యలక్ష్మి పెంట చేస్తుంది. నా కోడలు తీసుకుంటే తప్పేంటని అపర్ణ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు కావ్య.. రాజ్ నాటకం గురించి తెలుసుకుంటుంది. పుట్టింటికి వెళ్లి మూర్తితో బాధను చెప్పుకుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 14వ తేదీ ఎపిసోడ్ సీరియల్‌లో రాజ్ జీవితం నుంచి కావ్య తప్పుకుంటానని చెప్తుంది. అప్పుడే ఇందిరాదేవి వస్తుంది. ఎందుకు తప్పుకోవాాలని ప్రశ్నిస్తుంది. కావ్యకు దైర్యం చెప్తుంది. తనకు నీ మీద ప్రేమ ఉందని చెప్తుంది. నువ్వు కూడా నీ జీవితంలో ఓ అబ్బాయి ఉన్నట్లు నాటకం ఆడాలని నీకు సపోర్టుగా నేను ఉంటాను అంటూ భరోసా ఇస్తుంది. మరోవైపు కావ్యపై రెండు లక్షలు తీసుకుందని ఇంట్లో వాళ్లు నిందలు వేస్తారు. పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 15వ తేదీ ఎపిసోడ్ సీరియల్‌లో ఇందిరాదేవి, కావ్య ఇంటికి వస్తారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఒక్కసారిగా కావ్యపై తిట్లపురాణం మొదలు పెడుతుంది. రెండు లక్షలు పోయిన విషయం చెప్తుంది. దీంతో షాక్‌ అయిన ఇందిరాదేవి డబ్బుల గురించి అపర్ణను అడుగుతుంది. ఇంతలో స్వప్న బయటి నుంచి వస్తూ గట్టిగా ఆపండి అంటూ అరుస్తుంది. ఆ రెండు లక్షలు కావ్య నాకే ఇచ్చిందని చెప్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఫిబ్రవరి 16వ తేదీ ఎపిసోడ్ సీరియల్‌లో ఆ రెండు లక్షలు కావ్య తనకు ఇచ్చిందని స్వప్న చెప్తుంది. ఇంట్లో ఏ అవసరం వస్తుందోనని ఇచ్చిందని చెప్తుంది. ఇక రుద్రాణి తన రూములోకి వెళ్లి బీరువ చెక్ చేసుకుంటే 5 లక్షలు మాయం అవుతాయి. అయ్యో నా కోడలు నన్ను నిలువనా ముంచిందని బాధపడుతుంది. అప్పుడే స్వప్న వచ్చి వార్నింగ్ ఇస్తుంది. నా చెల్లిని ఇరికించాలని చూస్తే ఇలాగే ఉంటుందని చెప్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Brahmamudi Telugu Serial Weekly Roundup 2023 February 12th to February 17th episode

ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్ సీరియల్‌లో కావ్య రాజ్ కు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్తుంది. ఏంటా సర్ ప్రైజ్ అని రాజ్ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోడు. ఇక తెల్లారి కావ్యను సర్ ప్రైజ్ గురించి అడిగితే.. తన బావ ఫారిన్ నుంచి వస్తున్నట్లు చెప్తుంది. ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్నానని.. కావ్య చెప్తుంది. అయితే నాకేంటి అని రాజ్ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య తన బావతో కలిసి రాజ్ ఆఫీసుకు ఎంట్రీ ఇస్తుంది. రాజ్ ఆత్రుతగా చూస్తూ ఉంటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X