Brahmamudi: రాహుల్, రుద్రాణిలను ఆడేసుకుంటున్న స్వప్న... రాజ్ బండారం తెలుసుకునేందుకు ఆఫీసుకు కావ్య!
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఈ వారం మొత్తం అనేక ట్విస్టులతో సీరియల్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఇక ఈ వారం రాజ్, శ్వేత రిలేషన్ మీద కావ్య ఆందోళన పడుతూ ఉంటుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న కల్యాణ్.. కావ్యకు సపోర్టుగా నిలిచాడు. ఇక కల్యాణ్ సాయంతో.. శ్వేత ఎవరు.. రాజ్ కు శ్వేతకు సంబంధం ఏంటి.. ఆఫీసుకు వెళ్లేందుకు కల్యాణ్ ఏం సాయం చేశాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్రహ్మముడి సీరియల్ జనవరి 22వ తేదీ ఎపిసోడ్ లో రాజ్, శ్వేత మధ్య ఏం సంబంధం ఉందని కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ వల్ల కావ్యకు నీరసం వచ్చి పడిపోతుంది. స్వప్న చూసి.. ఆసుపత్రికి తీసుకుపోతుంది. ఇక స్వప్న ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ డాక్టర్ దగ్గర చూపిస్తుంది. ఇంతలో రాజ్.. శ్వేతను ఆసుపత్రికి తీసుకువస్తాడు. అది చూసి కావ్య షాక్ అవుతుంది. ఎవరు ఆమె అని ఆలోచనలో పడిపోతుంది. స్వప్నకు తెలియకుండా శ్వేత ఉన్న ఐసీయూ దగ్గరకు వెళ్తుంది.

బ్రహ్మముడి సీరియల్ జనవరి 23వ తేదీ ఎపిసోడ్ లో కావ్య ఆసుపత్రికి వెళ్లింది... ఈ సారికి నువ్వే వంట చేయమని ధాన్యలక్ష్మికి ఇందిరాదేవి చెప్తుంది. మరోవైపు రుద్రాణి, అనామిక ప్లాన్ వేస్తారు. కల్యాణ్ కు అధికారం ఇవ్వడం లేదంటూ.. అన్ని పనులు కల్యాణ్ కు చెప్తున్నారని... రుద్రాణి.. ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక రాజ్.. రాత్రి భోజనం చేసినప్పుడు కావ్య ఏమైందని అడుగుతాడు. నీకు తెలియదా.. కావ్యకు బాలేకపోతే ఆసుపత్రికి తీసుకువెళ్లింది స్వప్న అని ఇందిరాదేవి చెప్తుంది.
బ్రహ్మముడి సీరియల్ జనవరి 24వ తేదీ ఎపిసోడ్ లో రాజ్.. కావ్యకు బాలేదని తెలుసుకుని రాజ్... కావ్య దగ్గరకు వెళ్లి అడుగుతాడు. ఏమైందని అడిగితే.. బాలేదని చెప్తుంది. డాక్టర్ ఏం అన్నాడు అని కనుక్కుంటాడు. మందులు రాసిచ్చాడు అని చెప్పివెళ్లిపోతుంది. మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర ధాన్యలక్ష్మి అపర్ణ గొడవపడుతారు. ఆ విషయాన్ని తమ భర్తలకు సుభాష్, ప్రకాషంలకు చెప్పుకుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్రహ్మముడి సీరియల్ జనవరి 25వ తేదీ ఎపిసోడ్ లో కావ్య గదిలో పడుకుని ఉంటుంది. రాజ్ వచ్చి తిన్నవ అంటే తినలేదని చెప్తుంది. దీంతో రాజ్ నాకు బతిమిలాడటం రాదని చెప్తాడు. అయినా కావ్యతినకుండా పడుకుంటుంది. ఇక రాజ్ బయటకు వెళ్లి తినే ఫుడ్ తీసుకునివస్తాడు. బలవంతగా కావ్య చేతులు కట్టేసి మరీ తినిపిస్తాడు. ఇంత ప్రేమ చూపిస్తాడు ఆ విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బ్రహ్మముడి సీరియల్ జనవరి 26వ తేదీ ఎపిసోడ్ లో కావ్య దిగులుగా ఉండటం వల్ల ఏమైందని కల్యాణ్ అడుగుతాడు. రాజ్, శ్వేతల విషయాన్ని కావ్య కల్యాణ్ కు చెప్తుంది. దీంతో కల్యాణ్.. ఆమె శ్వేత.. అన్నయ్యను ఇష్టపడిందని చెప్తాడు. కానీ అన్నయ్య ఇష్టపడ్డాడో లేదో తెలియదు అంటూ చెప్తాడు. ఇక కావ్య... కల్యాణ్ కలిసి.. అన్నయ్య ఫోన్ చెక్ చేయాలని డిసైడ్ అవుతారు. ఇక అందులో భాగంగానే రాజ్ వాష్ రూముకు పోగానే కల్యాణ్ ఫోన్ తీసుకుని వస్తాడు. అందులో శ్వేత చాటింగ్ చూసి షాక్ అవుతాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్రహ్మముడి సీరియల్ జనవరి 27వ తేదీ ఎపిసోడ్ లో మరోవైపు అపర్ణ, ధాన్యలక్ష్మి అధికారం కోసం గొడవ పడుతుంటారు. దీంతో ఇందిరాదేవి వారికి బుద్ది చెప్తుంది. కలిసి మెలిసి ఉండాలని చెప్తుంది. మరోవైపు స్వప్న.. రుద్రాణి, రాహుల్ ను ఓ ఆట ఆడుకుంటుంది. ఇక కావ్యను ఆఫీసుకు పంపించేందుకు కల్యాణ్ ప్లాన్ వేస్తాడు. అపర్ణ దగ్గరకు వెళ్లి కావ్య.. ఆఫీసుకుపోతానని చెప్తుంది. దానికి అపర్ణ ఒప్పుకుంటుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











