Brahmamudi: స్వప్న యాడ్ గోల.. ఇంటి అప్పు గురించి తెలుసుకున్న రాజ్.. ఇంకా ఈ వారం ఏం జరిగిందంటే?
బ్రహ్మాముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తిని కలగజేస్తుంది. ఈ సీరియల్ ఇప్పుడు మాటీవీలో ప్రసారం అయ్యే సీరియల్స్ లో బెస్ట్ రేటింగ్ సాధిస్తోంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూలై 24 నుంచి జూలై 29 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..
స్పప్న పొగరు..:
ఇలా స్వప్న కావ్య ఇద్దరూ ఒకేసారి రావడంతో స్వప్న డ్రెస్ చూసి షాక్ దుగ్గిరాల ఫ్యామిలి షాక్ అవుతుంది. కావ్య అసలు ఈ డ్రెస్ లో బయటికి వెళ్లడం ఏంటి ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమైనా ఉందా అని అనడంతో స్వప్న మాత్రం పొగరుగా ఈ డ్రెస్ వేసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లానని చెబుతుంది. లోపలికి వెళ్లేసరికి అందరూ కూడా తన పట్ల సీరియస్ గా ఉంటారు. ఈ డ్రెస్ వేసుకొని వెళ్లడం ఏంటి అని ఒక్కొక్కరు తనని ప్రశ్నించగా రిచ్ పీపుల్స్ ఇలాగే ఉంటారని స్వప్న పొగరుగా మాట్లాడుతుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ధాన్యలక్ష్మి హ్యాపీ:
ఎపిసోడ్ ప్రారంభంలో ధాన్యలక్ష్మి కావ్య దగ్గరకి వచ్చి.. మా రాజ్ నిన్ను అందరి ముందు అంతగా వెనకేసుకురావడం అంటే మామూలు విషయమా అని సంతోషపడుతుంది. చూసిన నాకే అంత సంతోషంగా ఉంది, ఇక నువ్వు ఎంత సంబరపడుతున్నావో అని చూద్దామని వచ్చానని చెప్తుంది. కావ్య బాధగా మాట్లాడుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి.. దీని కోసమే ఇన్ని రోజులు ఎదురుచూశావు. నీ అణుకువ ఈ ఇంట్లో ఎవరూ గుర్తించలేదు. కానీ ఇన్నాళ్లకి రాజ్ నీ మంచితనాన్ని అర్థం చేసుకున్నాడు. రాజ్ లో మంచి మార్పు వచ్చింది అంటూ చెప్తుంది. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
స్వప్న యాడ్ వైరల్...:
స్వప్న యాడ్ చూసి రాహుల్ మెచ్చుకున్నట్టు నటిస్తాడు. ఇదొక్కటి చాలు దీన్ని ఇంట్లో నుంచి గెంటేయడానికని రుద్రాణి అనుకుంటుంది. ఈ వీడియో వైరల్ అయితే తప్పకుండా తనని ఇంట్లో నుంచి గెంటేస్తారని రాహుల్ అంటాడు. సెలెబ్రెటీ కావాలని స్వప్న అనుకుంటుంది కదా. నువ్వే ఈ వీడియో గురించి మీడియాకి చెప్పు వాళ్ళే మిగతాది చేస్తారు అని రుద్రాణి.. అనేసరికి వెంటనే రాహుల్ ఆ పనిలో పడతాడు. ఇక కనకం, కృష్ణమూర్తిని తీసుకుని స్వప్న ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సంప్రదాయం ప్రకారం కూతురు కడుపుతో ఉందని చీర, సారె తీసుకొచ్చాము అని కనకం చెబుతుంది. సూడిదలు తెచ్చారా? ఇవ్వకుండానే వెళ్తున్నారే. నీ కూతురు ఒడి నువ్వే నింపాలి అని ఇంద్రాదేవి చెబుతుంది. లేని కడుపు కోసం ఇంత ఆర్భాటం చేయాలా అని స్వప్న తిట్టుకుంటుంది. ఇక కనకం కూతురికి చీర, సారె పెట్టి దీవిస్తారు. తల్లీకొడుకులు తమ ప్లాన్ ఫెయిల్ అయినందుకు రగిలిపోతూ ఉంటారు. కనకం వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేసిందని తిట్టుకుంటారు.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇక అక్కడి వచ్చిన రాజ్... ఆ టాపిక్ ఈ పూటతో ముగింపు పలకండి. ఇక మీరెవరూ ఇబ్బందిగా ఫీల్ అవాల్సిన పని లేదు. ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఆ యాడ్ తీసిన వాళ్ళకి రూ.30 లక్షలు ఇచ్చి టెలికాస్ట్ కాకుండా బ్యాన్ చేయించాను.. అని చెప్తాడు. అయితే ఇక ఆ యాడ్ ఎందులోనూ రాదా? అని ఇంద్రాదేవి అంటుంది. రాదు నానమ్మ అంటాడు రాజ్. ఇది విన్న స్వప్న.. కోపంగా రాజ్ మీద విరుచుకుపడుతుంది. ఆ యాడ్ ని బ్యాన్ చేయించావా? ఎవరిని అడిగి చేశావ్ అని ఫైర్ అవుతుంది. నువ్వు ఎవరిని అడిగి చేశావ్ అని రాజ్ అడగ్గా... అది నా పర్సనల్ అని సమాధానం చెబుతుంది.పుల్ స్టోరీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











