Brahmamudi మళ్లీ అప్పుతో కల్యాణ్ స్నేహం.. కావ్య విడాకుల విషయంలో రాజ్ ట్విస్ట్!
బ్రహ్మముడి సీరియల్ ఈ వారం మొత్తం ఉత్కంఠగా సాగింది. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు అనేక ట్విస్టులతో సీరియల్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇందిరాదేవి సాయంతో కావ్య, ఆమె బావ భాస్కర్ కలిసి స్టార్ట్ చేయగా.. రాజ్ రివర్స్ డ్రామా మొదలుపెడుతాడు. దీంతో కావ్య, ఇందిరాదేవి కలిసి రాజ్ పై ఆఖరి అస్త్రం ప్రయోగిస్తారు. విడాకుల పేపర్లు తీసుకుని కావ్య రాజ్ కు ఇస్తుంది. మరి రాజ్ కావ్యకు విడాకులు ఇచ్చాడా లేదా అనేది సస్పెన్స్ లో పెట్టారు. ఇక ఈ వారం మొత్తం సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మార్చి 11న బ్రహ్మముడి సీరియల్లో కావ్య, ఆమె బావ క్లోజ్ గా ఉండటం చూసి.. రాజ్ రివర్స్ డ్రామా ప్లే చేస్తాడు. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి రండి అంటూ తనకు జలసీ లేదని చెప్పుకునేందుకు డ్రామా స్టార్ట్ చేస్తాడు. దీంతో కావ్య, ఆమె బావ షాక్ అవుతారు. ఈ విషయాన్ని ఇందిరాదేవికి చెప్తారు. దీంతో నా మనవడికి నేనే కరెక్ట్.. ఏం చేయాలో నాకు తెలుసు అంటూ చెప్పుకువస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్చి 12న బ్రహ్మముడి సీరియల్లో కల్యాణ్, అప్పును కలుసుకుంటాడు. అప్పుతో తన బాధను చెప్పుకుంటాడు. అనామిక సైతం నా మాట వినడం లేదని చెప్పుకుంటాడు. దీంతో అప్పు దైర్యం చెప్తుంది. అనుకున్నది సాధిస్తావ్ అని భరోసా ఇస్తుంది. దీంతో కల్యాణ్ ఎప్పుడూ నాతో ఉంటానని ప్రామిస్ చేయమని అడుగుతాడు. అప్పు ఓకే అంటూ చేతిలో చేయేసి చెప్తుంది. అప్పుడే అనామిక, ధాన్యలక్ష్మి కారులో వెళ్తుండగా వీరిని చూస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్చి 13న బ్రహ్మముడి సీరియల్లో అనామిక, ధాన్యలక్ష్మి... అప్పు కల్యాణ్ బాగోతం తెలుసుకుని కనకం ఇంటికి వెళ్తారు. అక్కడ కనకం, మూర్తిలను నానా మాటలు అనేసి వస్తారు. దీంతో కనకం కూడా అదే రేంజులో ఫైర్ అవుతుంది. కొట్టుకునే రేంజులో మాట్లాడుకుంటారు. ఇక అప్పు, కల్యాణ్ ఇంటికి రాగానే కనకం కల్యాణ్ ను తిడుతుంది. ఏమైందని అడిగితే అప్పుడు అసలు విషయం చెప్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మార్చి 14న బ్రహ్మముడి సీరియల్లో విషయం తెలుసుకున్న కల్యాణ్ సీరియస్ గా ఇంటికి వెళతాడు. అక్కడ ధాన్యలక్ష్మి, అనామిక పెంట పెడుతూ ఉంటారు. కావ్య మీద ఫైర్ అవుతూ ఉంటారు. అప్పు కల్యాణ్ ను బుట్టలో వేసుకునేందుకు ప్లాన్ చేస్తుందని ఆరోపిస్తారు. అప్పుడే కల్యాణ్ వచ్చి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాడు. మాది స్నేహం అంటూ చెప్పుకువస్తాడు. ధాన్యలక్ష్మికి, అనామికకు గడ్డిపెడతాడు. దీంతో వాళ్లు సైలెంటుగా వెళ్లిపోతారు.
మార్చి 15న బ్రహ్మముడి సీరియల్లో కావ్య కాఫీ తీసుకుని రాజ్ వద్దకు వెళ్తే.. డబ్బులు ఇస్తాడు. ఇక నువ్వు ఉండవు కదా అందుకే ఇచ్చేశాను అని చెప్తాడు. ఈ విషయం ఇందిరాదేవికి చెప్తుంది కావ్య. దీంతో మనవడిపై అఖరి అస్త్రం ప్రయోగించాలని చెప్తుంది. విడాకులు ఇవ్వమని అంటుంది. మీరు ఇద్దరు ఒక్కటి కావాలంటే విడాకులు ఇవ్వు వాడే బయటపడుతాడని చెప్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్చి 16న బ్రహ్మముడి సీరియల్లో కావ్య విడాకులపైన సంతకం చేసి రాజ్ కు ఇస్తుంది. నీ ఇష్టప్రకారమే విడాకులు ఇస్తున్నట్లు చెప్పి వెళ్లిపోతుంది. దీంతో రాజ్ షాక్ అయిపోతాడు. బాధలో కూడా ఉంటాడు. కానీ బయటపెట్టడు. మరోవైపు శ్వేత ఆ విడాకుల పత్రాలు చూసి.. షాక్ అవుతుంది. కావ్య లాంటి అమ్మాయిని వదులుకోవద్దని సలహా ఇస్తుంది. ఇక రాజ్ తన విడాకుల నిర్ణయాన్ని సస్పెన్స్ లో పెట్టాడు. కావ్య అమ్మనాన్నలు వచ్చాక తన నిర్ణయం చెబుతా అంటూ చెప్పుకువస్తాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications










