Brahmamudi కావ్యకు విడాకులు ఇచ్చేసిన రాజ్.. సీరియల్‌లోకి మరో హీరోయిన్ ఎంట్రీ?
బ్రహ్మముడి సీరియల్ ఈ వారం అనేక ట్విస్టులతో ఉత్కంఠగా సాగింది. కావ్యకు పెళ్లి రోజున మంచి గిఫ్ట్ తీసుకువస్తాడు అనుకున్నారు అంతా. ఇక రాజ్ తన కొడుకుతో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు. నా రక్తం దుగ్గిరాల వంశ వారసుడు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు రాజ్. ఇక కావ్య పరిస్థితి దిక్కుతోచని అగమ్యగోచరంగా మారింది. విడాకులు రద్దు చేసిని తనతో జీవితం ప్రారంభిస్తాడు అనుకున్న కావ్యకు.. ఊహించని షాకిచ్చాడు రాజ్. ఇక ఇంట్లోని దుష్టచతుష్టయం అంతా రాజ్ ను దించి.. రాహుల్ కి పట్టాభిషేకం చేయాలని ఆలోచనలు చేస్తూంటారు. అసలు ఆ బిడ్డకు తల్లి ఎవరు.. కావ్యకు రాజ్ విడాకులు ఇచ్చాడా అనేది తెలియాలంటే.. ఇక ఈ వారం మార్చి 18వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు సీరియల్ లో ఏం జరిగిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మార్చి 18వ తేదీ ఎపిసోడులో అనామిక ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి వస్తారు. ఇక వారి ముందు తన భర్త కల్యాణ్.. ఆఫీస్ వర్కంతా చూసుకుంటాడు అంటూ బిల్డప్ ఇస్తుంది. చాలా బిజీగా ఉంటారు.. అంటూ మాట్లాడుతుంది. ఇంతలో కల్యాణ్ వస్తాడు. వచ్చి వాళ్లకు నిజం చెప్పేస్తాడు. తాను ఒక రైటర్.. ఏ ఆఫీస్ వర్క్ చూసుకోవడం లేదని చెప్తాడు. ఇక ఫ్రెండ్స్ అనామికకు కల్యాణ్ చాలా మంచివాడని చెప్పి వెళ్తారు. మరోవైపు రాజ్ కు కావ్య విడాకుల పేపర్లు ఇస్తుంది. తన నిర్ణయాన్ని పెళ్లి రోజు ఫంక్షన్లో చెబుతా అంటూ సస్పెన్స్ లో పెడుతాడు.

మార్చి 19వ తేదీ ఎపిసోడులో కావ్య, రాజ్ లతో వ్రతం చేయించాలని ఇందిరాదేవి అనుకుంటుంది. ఇక దానికి అపర్ణ అవసరమా అన్నట్లు మాట్లాడుతుంది. దీంతో రుద్రాణి, ధాన్యలక్ష్మి.. నీ కోడలి మీద కోపంతోనే ఒప్పుకోవడం లేదని అంటారు. దీంతో వాళ్ల ముందు పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఒప్పుకుంటుంది. వ్రతం మీద రాజ్, కావ్యలు కూర్చుంటారు. వ్రతం చివరిన ప్రమాణం చేయమని పంతులు రాజ్ కు చెప్తాడు. రాజ్ ప్రమాణం చేయాలా వద్దా అని ఆలోచనలో పడుతాడు. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
మార్చి 20వ తేదీ ఎపిసోడులో రాజ్ ప్రమాణం చేసే సమయానికి హారతి పళ్లెంను అపర్ణ కాలడంతో కిందపడేస్తుంది. దీంతో ఇందిరాదేవి మళ్లీ వెలిగించు అని చెప్తుంది. ఈలోపు రాజ్ కు కాల్ రావడంతో వెళ్లిపోతాడు. ఇక ఈవెనింగ్ ఫంక్షన్ కి రాజ్ విడాకుల పత్రాలతో ఎంట్రీ ఇస్తాడు. తనకు కావ్య విడాకులు ఇవ్వాలనుకుంది. తనను వదులుకోవడం ఇష్టంలేదని.. కాగితాలు చింపేసి ఒక్కటవుతారు. కానీ ఇక్కడ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంటుంది. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
మార్చి 21వ తేదీ ఎపిసోడులో ఫంక్షన్లో రాజ్ కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ఇక కావ్య కూడా రాజ్ కోసం చూస్తుండగా..కారులో వస్తాడు. ఆ తర్వాత పక్కన డోర్ తీసి బాబుతో ఫంక్షన్ కు ఎంట్రీ ఇస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఆ బాబు ఎవరు అంటూ ప్రశ్నలు సందిస్తారు. అయితే వాటికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోతాడు. కావ్య పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. అసలు ఆ బిడ్డకు తల్లి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
మార్చి 22వ తేదీ ఎపిసోడులో కావ్య.. రాజ్ గదిలోకి వెళ్లి ఆ బాబు తల్లి ఎవరు అంటూ ప్రశ్నిస్తుంది. కానీ రాజ్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోతాడు. ఇక కనకం తన బిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఇందిరాదేవి అడుగుతుంది. ఇక అపర్ణ వచ్చి ఫైర్ అవుతుంది. నీ కూతురు వల్లే మా కుటుంబానికి సమస్యలు అంటూ ఆరోపిస్తుంది. దీంతో నా కూతురిని నాతో పంపించు అంటూ ఫైర్ అవుతుంది. అప్పుడు కావ్య వచ్చి కనకానికి సర్ది చెప్తుంది. మరోవైపు తన భర్త రాజ్ తప్పు చేయలేదని కావ్య నమ్ముతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
మార్చి 23వ తేదీ ఎపిసోడులో రాజ్.. ఆ బాబుతో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. దీంతో హాల్లోకి ఎత్తుకుని వస్తుంటే.. అపర్ణ ఆ బాబును వదిలించుకోమని సలహా ఇస్తుంది. కానీ రాజ్ దానికి నో అంటాడు. నేను నా వారసుడు గెస్టుగానే ఉంటాం ఈ ఇంట్లో అని చెప్పుకువస్తాడు. మరోవైపు బాబు కోసం పాలు తీసుకుని వెళ్తుంది కావ్య. దీంతో కావ్యపై అపర్ణ ఫైర్ అయితే.. ఆ బాబు ఏం తప్పు చేశాడు అంటూ కావ్య వివరిస్తుంది. ఇక మరోవైపు కావ్యకు రాజ్ విడాకులు ఇస్తాడు. పత్రాలపై సైన్ చేసి ఇచ్చేస్తాడు. మరి ఆ బాబు తల్లి ఎవరు.. సీరియల్లోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుందా అనేది తెలియాలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











