Brahmamudi: స్వప్న జీవితం బుగ్గిపాలు.. రాజ్‌కు ప్రియుడి గురించి చెప్పేసిన పెద్దావిడ
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక ఈ వారం పూర్తి ట్విస్టులతో సాగింది. స్వప్నను ఇరికించేందుకు రాహుల్ స్కెచ్ వేస్తాడు. ఇక ఇంట్లో వాళ్లకు స్వప్న మీద డౌట్ వచ్చేలా చేస్తాడు. ఇక రాజ్ కు కూడా ఆ విషయం తెలిసిపోతుంది. మరోవైపు అప్పు ప్రేమ విషయం కనకానికి తెలిసిపోతుంది. ఇలా వారం మొత్తం ఉత్కంఠగా సాగింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 18వరకు ఏం జరిగిందో ఈస్టోరీలో తెలుసుకుందాం.
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 13వ తేదీన ఎపిసోడ్ లో అనామిక, కల్యాణ్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలుసుకుని అప్పు బాధలో మునిగిపోతుంది. ఇక కల్యాణ్, అనామిక హాగ్ చేసుకుని సంతోషంలో మునిగిపోతే.. అప్పు బాధతో వెళ్లిపోతుంది. మరోవైపు సీతారామయ్య తన వీలునామా రాసి ఇస్తాడు. లాయర్ వచ్చి చదువుదాం అనుకునే లోపే.. రాజ్ వచ్చి దాన్ని ముక్కలు గా చేస్తాడు. దాంట్లో ఏం రాసి ఉంటాడు అనుకుని రుద్రాణి ఎవరు లేనిది చూసి ఆ ముక్కలు ఏరుకుని చదువుతుంది. ఆ వీలునామా చదివి రుద్రాణి మూర్చబోతుంది.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 14వ తేదీన ఎపిసోడ్ లో అనామిక, కల్యాణ్ ప్రేమను చూసి అప్పు బాధ పడుతూ ఉంటుంది. మరోవైపు స్వప్నను వదిలించుకోవడానికి రాహుల్ బిగ్ స్కెచ్ వేస్తాడు. స్వప్న బాయ్ ఫ్రెండ్ ను రంగంలోకి దింపాలని ఫిక్స్ అవుతాడు. తల్లికి తన ప్లాన్ చెప్పి.. దీన్ని వదిలించుకోవాలి అంటూ పథకం వేస్తాడు. అందులో భాగంగానే ఆ డాక్టర్ అరుణ్ ను రాహుల్ కలుస్తాడు. నీకు ఏదో గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ నేను ఇప్పిస్తాను.. నాకు హెల్ప్ చేయాలని చెప్తాడు. దానికి అరుణ్ ఒప్పుకుంటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 15వ తేదీన ఎపిసోడ్ లో కావ్య కొత్త నాటకం మొదలు పెడుతుంది. అందులో భాగంగానే ఓ బోర్డ్ మీద సారీ కళవతి అంటూ రాస్తుంది. కానీ ఇంట్లో వాళ్లంతా అది రాజ్ రాశాడు అని అనుకుంటారు. ఎందుకు పెళ్లాంకు సారీ చెప్పాలనుకుంటే బెడ్ రూంలో చెప్పుకో ఇలా ఎందుకు అని అడుగుతారు. మరోవైపు రాహుల్ తన కొత్త డ్రామాను స్టార్ట్ చేస్తాడు. దుగ్గిరాల ఫ్యామిలీ పేరుతో ఓ కొరియర్ పంపిస్తాడు. అందులో అరుణ్ స్వప్న ఫోటోలు పంపిస్తాడు. అవి ఇందిరాదేవి చేతికి చేరుతాయి. ఇక వాటిని తీసుకువెళ్లి స్వప్నను అడుగుతుంది. కానీ స్వప్న అబద్ధం ఆడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 16వ తేదీన ఎపిసోడ్ లో అప్పు రూమ్ సర్దుతుంటే.. కనకానికి కల్యాణ్ ఫోటో కనిపిస్తుంది. దానిమీద ఐ లవ్ యూ కల్యాణ్ రాసి ఉండటం చూసి.. షాక్ అవుతుంది. ఇక కల్యాణ్ ను అప్పు ఇష్టపడుతుందని చితకబాదుతుంది. ఎందుకు ఇలా చేశావ్ అంటూ అప్పును బాదుతుంది. మరోవైపు స్వప్న అరుణ్ ఫోటోలు చూసి ఇందిరాదేవి షాక్ అవుతుంది. స్వప్న ఎందుకు అబద్ధం చెప్తుందని ఆలోచిస్తుంది. అసలు విషయం తెలుసుకోవాలని అనుకుంటుంది.
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 17వ తేదీన ఎపిసోడ్ లో అప్పు ప్రేమ విషయం నాకు ముందే తెలుసు అని అన్నపూర్ణ అంటుంది. ఇక అప్పు దగ్గరకు వెళ్లి సారీ చెప్తుంది. అప్పు కూడా బాధపడుతుంది. అలా జరిగిపోయిందని చెప్తుంది. మరోవైపు స్వప్న టిఫిన్ చేసేందుకు డైనింగ్ హాల్ దగ్గరకు వస్తుంది. ఇందిరాదేవి స్వప్నను చూస్తూ ఉంటుంది. ఆ దెబ్బకు స్వప్న మళ్లీ లోపలికి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్, కావ్యలు ప్రేమగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 18వ తేదీన ఎపిసోడ్ లో స్వప్నకు అరుణ్ ఫోన్ చేస్తాడు. మీ ఇంటి ముందే ఉన్నాను కిందకి రా అని చెప్తాడు. ఇక స్వప్న కిందకి వస్తుంది. ఇక ఆ దృశ్యాన్ని కావ్య, రాజ్ లు చూస్తారు. రాజ్ కు డౌట్ వస్తుంది. స్వప్నకు కావ్య వార్నింగ్ ఇస్తుంది నేనేం తప్పు చేయలేదని చెప్తుంది. ఏమైనా చేసుకో.. ఈ సారి నాకు ఏదైనా తెలిస్తే ఇంట్లో చెప్పేస్తా అని చెప్తుంది కావ్య. మరోవైపు ఇందిరాదేవి రాజ్ కు స్వప్న విషయం చెప్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











