Brahmamudi: రాజ్ అక్రమ సంబంధం బయటపెట్టిన కావ్య... దుగ్గిరాల ఇంటికి మరో కోడలిగా అప్పు?
బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తిగా సాగుతుంది. ఈ వారం కూడా ట్విస్టులతో సాగింది. స్వప్న కడుపులో ఉన్న బిడ్డ తనది కాదు అంటూ రాహుల్ చెప్తాడు. డీఎన్ఏ టెస్టుకు కూడా సిద్ధమని చెప్తుంది స్పప్న. మరోవైపు రాజ్, కావ్య.. అరుణ్ కోసం గాలిస్తూ ఉంటారు. అరుణ్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతారు. మరోవైపు అప్పు ప్రేమను గెలిపించేందుకు కనకం దుగ్గిరాల ఇంటికి పోయేందుకు రెడీ అవుతుంది. స్వప్న కడుపు అడ్డు పెట్టుకుని పోయేందుకు రెడీ అవుతుంది. ఇలా వారం మొత్తం ఉత్కంఠగా సాగింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 వరకు ఏం జరిగిందో ఈస్టోరీలో తెలుసుకుందాం.
నవంబర్ 27వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న డీఎన్ఏ టెస్టుకు సిద్ధం అని చెప్తుంది. ఇక స్వప్న విషయం గుర్తు చేసుకుని రాజ్ ఛీ ఛీ అంటూ తక్కువ చేసి మాట్లాడుతాడు. దీంతో పవిత్రతకు సాక్ష్యం కావాలా ఏంటి అని కావ్ అడుగుతుంది. నేనే కళ్లారా చూశాను అంటూ రాజ్ అంటాడు. వీరి మధ్య వాదన జరుగుతుంది. మరోవైపు రాహుల్ .. స్వప్నను గదిలోంచి బయటకు పంపాలని చూస్తాడు. కానీ రాహుల్ కు వార్నింగ్ ఇచ్చి.. బయటకు గెంటేస్తుంది స్వప్న.

నవంబర్ 28వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పు కోసం అనామికను కల్యాణ్ హర్ట్ చేస్తాడు. దీంతో అప్పు ప్రేమను గెలిపించాలని కనకం అనుకుంటుంది. కల్యాణ్, అనామిక పెళ్లి జరగకుండా చేయాలేని.. కల్యాణ్ కు అప్పు మీద ప్రేమను బయటకు రప్పించాలని కనకం అనుకుంటుంది. మరోవైపు అరుణ్ కోసం అప్పు వేట మొదలు పెడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
నవంబర్ 29వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పుతో ప్రేమగా కల్యాణ్ మాట్లాడుతుంటే.. అనామిక వచ్చి చూసి హర్ట్ అవుతుంది. మీ ఫ్రెండుతోనే ఉండు అంటూ చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్య తనను బయటకు తీసుకుపో అని చెప్పిన రాజ్ వినడు. ఇక ఇంట్లో అందరి ముందు రాజ్ ను అడ్డంగా ఇరికిస్తుంది కావ్య. ఇక కావ్య నాటాకానికి రాజ్ ఇక చాలు పద అని బయటకు తీసుకుపోతాడు.
నవంబర్ 30వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న నిజంగానే తల్లి కాబోతుందని కనకానికి కావ్య చెప్తుంది. అస్సలు నమ్మను అంటూ కనకం చెప్తుంది. అది మళ్లీ కొత్త డ్రామా స్టార్ట్ చేసిందని కావ్యతో అంటుంది.. ఇక ఫోన్ స్పీకర్ లో ఉండటంతో రాజ్ నవ్వుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఆసుపత్రి కోసం రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ అరుణ్ మాత్రం తప్పించుకుంటాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డిసెంబర్ 1వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్నను బయటకు గెంటయబోతుంటే.. డీఎన్ఏ టెస్టు చేయించి నిజం తెలుసుకున్న తర్వాత గెంటేయండి అని చెప్తుంది. ఇక కావ్య ఎంటర్ ఏంటి ఆడదానికి శీల పరీక్ష ఎందుకు అని ప్రశ్నిస్తుంది. స్వప్న నేను సిద్ధమే అని చెప్తుంది. అవును మీ గురించి నిజం తెలిసిపోయింది అంటూ కావ్య రివర్స్ గేమ్ మొదలు పెట్టింది. ఇంకా ఎంతకాలం నన్ను మోసం చేస్తారు. ఇంకా ఎంత కాలం నా కళ్లుగప్పి ఈ తప్పుడు పని చేస్తుంటారు అంటూ నిలదీస్తుంది. మీ ఆఫీసులో పనిచేసే శృతికి మీకు ఏంటి సంబంధం అంటూ కావ్య అడుగుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డిసెంబర్ 2వ తేదీ బ్రహ్మముడి ఎపిసోడ్ లో మీ ఆఫీసులో పనిచేసే శృతికి మీకు ఏంటి సంబంధం అని రాజ్ ను కావ్య అడుగుతుంది. తను ఎంప్లాయి.. నేను బాస్ అని రాజ్ చెప్తాడు. అంతేనా ఆ పరిచయం, అంతటితోనే ఆగిందా... అని కావ్య నిలదీస్తుంది. అడిగేదేదో సూటిగా అడుగు అంటాడు రాజ్. మీకు శృతికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో నాకు తెలసిపోయిందని కావ్య అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అని రాజ్ సీరియస్ అవుతాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











