Brahmamudi: స్వప్న బండారం బయటకు.. అక్కా చెళ్లెళ్లు దుగ్గిరాల ఇంటి నుంచి ఔట్!
బ్రహ్మముడి సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ.. టీఆర్పీ రేటింగ్ లో కూడా దూసుకుపోతుంది. ఇక ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇక గత వారం మొత్తం కూడా అంటే అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం.
అక్టోబర్ 31వ తేదీ ఎపిసోడ్ లో దుగ్గిరాల కుటుంబం మొత్తం స్వప్నకు సీమంతం ఘనంగా చేస్తూ ఉంటారు. ఇక కావ్య, రాజ్ కలిసి పనులు అన్ని చేస్తూ ఉంటారు. ఇక బట్టలు మార్చుకోడానికి కావ్య, రాజ్ పైకి వెళ్తారు. కాసేపు అక్కడ వాదించుకుంటారు. ఇక చివరకు కావ్య సెలక్ట్ చేసిన డ్రెస్ ను వేసుకుని వచ్చి.. అపర్ణకు షాక్ ఇస్తాడురాజ్. మరోవైపు రుద్రాణి.. తన కోడలి కడుపు లేదనే విషయం బయట పెట్టేందుకు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ శ్రీదేవి.. స్వప్నకు కడుపు లేదని కన్మార్మ్ చేయడంతో అసలు ప్లాన్ మొదలు పెడుతుంది రుద్రాణి.

అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో.. స్వప్న సీమంతం చూసి కనకం మురిసిపోతూ ఉంటుంది. ఇక రుద్రాణి.. స్వప్న నాటాకాన్ని బయటపెట్టేందుకు డాక్టర్ ను పిలిపిస్తుంది. ఇక డాక్టర్ తో నిజం చెప్పించాలని చూస్తుంది. ఆమె సైలెంట్ అయిపోయే సరికి.. రుద్రాణి వెళ్లి స్వప్న కడుపుకు ఉన్న ప్యాడ్ తీసేస్తుంది. దీంతో స్వప్న ప్రెగ్నెన్సీ నాటకం అందరి ముందు బయటపడుతుంది. స్వప్నకు అసలు ప్రగ్నెన్సీ లేదని తెలిసి అందరూ షాక్ అవుతారు. పూర్తి ఎపిసోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో స్వప్న చేసిన తప్పును కావ్యపై నెట్టి వేస్తుంది. ఇక కావ్యను ఇంట్లో వాళ్లంతా తప్పుబడుతారు. కావ్య కూడా సైలెంట్ అయిపోతుంది. నీ కొడల్ని నువ్వు పంపించు... నా కొడల్ని నేను పంపిస్తాను అంటుంది. ఇక కనకం అడ్డుకోబోతుంటే.. క్షమించే ప్రసక్తే లేదు అంటూ ఖరాఖండిగా చెప్తుంది. ఇద్దరినీ పుట్టింటికి పంపుతాను అంటుంది. ఇక స్వప్న రివర్స్ డ్రామా చేస్తుంది. రాహుల్ ను కూడా పంపించండి అంటుంది.ఇక స్వప్న రివర్స్ డ్రామా చేస్తుంది. రాహుల్ ను కూడా పంపించండి అంటుంది. పూర్తి ఎపిసోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో స్వప్న చేసిన పనికి కావ్య చెంపపగులగొడుతుంది. ఇక తనను ఇరికించడంపై కావ్య ఫైర్ అవుతుంది. ఇక కోర్టుకు ఎక్కి ఈ ఇంటి పరువు తీస్తా అంటూ స్వప్న రెచ్చిపోతుంది. దీనికి కావ్య నువ్వు కోర్టుకు పోతానంటే.. నేనే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తా అంటూ కావ్య సమాధానం చెప్తుంది. ఈ ఇంట్లో అణిగిమణిగి ఉండాలి అంటూ కావ్య.. స్వప్నకు వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరోవైపు కృష్ణమూర్తి, కనకం బాధ పడుతూ కూర్చొంటారు. స్వప్న చేసిన పనికి దిగాలుగా కూర్చొని మాట్లాడుకుంటారు. పూర్తి ఎపిసోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
అక్టోబర్ 4వ ఎపిసోడ్ లో రాజ్ చేసిన మోసం గురించి కనీసం రాజ్ కు అయినా చెప్పాలి కదా అని అపర్ణ.. సుభాష్ తో ఫైర్ అవుతుంది. నా కొడుకు భార్య చేతిలో మోస పోయాడు.. అందరి ముందు తలదించుకున్నాడు... ఇప్పుడు రాజ్ మనసు బాధపడుతుందో.. అంటూ చెప్తుంది. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా.. కనీసం మీకైనా చెప్పిందా అంటూ సుభాష్ తో చెప్పుకుంటూ అపర్ణ ఆవేదన చెందింది. నిజం ఎందుకు చెప్పలేదు అంటూ ఆవేశపడిపోయింది. ఎందుకంటే ఆమెకు కృతజ్ఞత అంటే తెలియదు.. మోసం చేయడం మాత్రమే తెలుసు.. ఇప్పుటికైనా కళ్లు తెరుచుకోండి అంటూ అపర్ణ.. సుభాష్ తో చెప్పి వెళ్లిపోతుంది.పూర్తి ఎపిసోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











