Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు శాపం నిజమైందా?.. మనోజ్ కంటిచూపు పోతుందా?.. అరుణ్ లవ్ ప్రపోజల్..

Gunde Ninda Gudi Gantalu Weekly Roundup: గుండె నిండా గుడిగంటలు ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా జూలై 6వ తేదీ నుంచి జూలై 10వ వరకు 720 నుంచి 724వ ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

సోమవారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. మీనాపై కుట్ర చేసిన ప్రభావతి, మనోజ్‌కు బుద్ధి చెప్పాలనే కోపంతో శృతి వారి డైట్ ఫుడ్‌లో ఆముదం కలపడంతో ఇద్దరికీ తీవ్ర విరోచనాలు అవుతాయి. వరుసగా వాష్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడంతో ఇంట్లో నవ్వులు పూస్తాయి. అయితే పరిస్థితి విషమించడంతో శృతి భయపడగా, మీనా ఇంటి చిట్కాతో కషాయం ఇచ్చి ఇద్దరినీ కోలుకునేలా చేస్తుంది. అయినప్పటికీ ప్రభావతి, మనోజ్ మరోసారి మీనాపైనే నిందలు వేయడంతో శృతి తీవ్రంగా మండిపడుతుంది. చివరకు సత్యం ఇకపై ఇంట్లో అందరూ ఒకటే భోజనం తినాలని, మీనాను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial weekly episodes july 6th to july 10th here is highlights
Recommended For You
S Janaki: సింగర్ జానకమ్మ గురించి ఎవరికీ తెలియని 5 ఇంటెస్ట్రింగ్ ఫ్యాక్ట్స్.. మీకు ఇవి తెలుసా?
S Janaki: సింగర్ జానకమ్మ గురించి ఎవరికీ తెలియని 5 ఇంటెస్ట్రింగ్ ఫ్యాక్ట్స్.. మీకు ఇవి తెలుసా?

Jio Hotstar
మరోవైపు గుడిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్, సుమతిపై తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఆమె మంచితనం తనను ఆకట్టుకుందని, జీవిత భాగస్వామిగా చూడాలని కోరుతూ సమాధానం కోసం ఎదురుచూస్తానని చెబుతాడు. ఈ అనూహ్య పరిణామంతో సుమతి షాక్‌కు గురవుతుంది. అనంతరం గుడి వద్ద బాలు, అరుణ్ మధ్య చిన్న గొడవ చోటుచేసుకుంటుంది. బాలు కారును వెనక్కి తీసే సమయంలో అరుణ్ బైక్‌కు దగ్గరగా వెళ్లడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు. బాలుపై ఇప్పటికే కక్ష పెట్టుకున్న అరుణ్, మరోసారి తప్పు చేస్తే జైలుకు పంపిస్తానని హెచ్చరించడంతో కథ మరింత ఉత్కంఠగా మారింది.

You May Also Like
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్ వేళ.. హైదరాబాద్ నా రెండో ఇల్లు అంటున్న భాగ్యశ్రీ
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్ వేళ.. హైదరాబాద్ నా రెండో ఇల్లు అంటున్న భాగ్యశ్రీ

మంగళవారం ఎపిసోడ్‌లో వరుస ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి. తండ్రి సత్యంను అవమానిస్తూ మనోజ్ మాట్లాడటంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేసి అతడిపై దాడి చేస్తాడు. దీంతో ఇంట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. ప్రభావతి మాత్రం ఎప్పటిలాగే మనోజ్‌కే మద్దతుగా నిలవడంతో కుటుంబంలో విభేదాలు మరింత పెరుగుతాయి. ఇదే సమయంలో ఫర్నిచర్ షాప్‌కు హెల్మెట్ ధరించి వచ్చిన మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి రోహిణి కంగారుపడుతుంది. బాలు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా, ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో మాణిక్యం అక్కడి నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు ఇంట్లో జరిగిన అవమానంతో బాధపడుతున్న మనోజ్‌కు, రూ.30 లక్షలు మోసం చేసిన విల్లా విజయ్ కనిపిస్తాడు.

Fauzi OTT: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ'కి జాక్‌పాట్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Fauzi OTT: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ'కి జాక్‌పాట్.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

అతడిని వెంబడించే క్రమంలో మనోజ్ వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొని తీవ్రంగా గాయపడతాడు. మనోజ్‌ను ఆస్పత్రికి తరలించగా, ప్రమాదానికి కూడా బాలునే కారణమంటూ ప్రభావతి అతడిపై మండిపడుతుంది. శస్త్రచికిత్స అనంతరం మనోజ్ ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, గాజు పెంకులు కళ్లలోకి గుచ్చుకోవడంతో కంటి చూపుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని డాక్టర్లు వెల్లడిస్తారు. ఉదయం బాలు కోపంలో చెప్పిన "నీ కళ్లే పోతాయి" అనే మాటలు గుర్తుకొచ్చి కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురవుతారు. మనోజ్‌కు చూపు తిరిగి వస్తుందా? ప్రభావతి-బాలు మధ్య విభేదాలు మరింత ముదురుతాయా? అన్న ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

అదే నా గుర్తింపు.. ఆ దారిని ఎన్నటికీ మర్చిపోను: ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ
అదే నా గుర్తింపు.. ఆ దారిని ఎన్నటికీ మర్చిపోను: ఇడుపు కాయితం హీరోయిన్ నాగదుర్గ

బుధవారం ఎపిసోడ్ పూర్తిగా భావోద్వేగాలతో సాగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను డాక్టర్లు అత్యవసరంగా ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తారు. కళ్లలో గాజు పెంకులు ఉండటంతో వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిందేనని, లేకపోతే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు చెబుతారు. ఈ వార్తతో ప్రభావతి, రోహిణి, సత్యం తీవ్ర ఆందోళనకు గురవుతారు. అదే సమయంలో రూ.1.70 లక్షల ఆస్పత్రి బిల్లు వెంటనే చెల్లించాలని చెప్పడంతో బాలు తీవ్ర ఇబ్బందిలో పడతాడు.

ఎన్టీఆర్‌కు పోటీగా ధనుష్? ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రెండు సినిమాలు..
ఎన్టీఆర్‌కు పోటీగా ధనుష్? ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రెండు సినిమాలు..

డబ్బుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, మీనాకు బంగారం కొనివ్వాలని రహస్యంగా దాచిన తన పొదుపు మొత్తాన్నే మనోజ్ చికిత్స కోసం ఖర్చు చేయాలని బాలు నిర్ణయించుకుంటాడు. "మీనాకు మళ్లీ బంగారం కొనిపెట్టగలను.. కానీ అన్నయ్య కంటి చూపును తిరిగి తీసుకురాలేను" అంటూ చేసిన అతని త్యాగం కుటుంబ బంధాల విలువను చాటుతుంది. మీనా కూడా బాలుకు అండగా నిలిచి ఆస్పత్రి బిల్లు చెల్లిస్తుంది. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. చివరకు డాక్టర్లు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని చెప్పినా, మనోజ్ కళ్లకు ఇంకా కట్లు విప్పకపోవడంతో అతడి చూపు తిరిగి వస్తుందా అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.

ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్
ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్

గురువారం ఎపిసోడ్‌లో భావోద్వేగాలు, కుటుంబ విభేదాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రమాదం తర్వాత కంటి చూపు పోతుందేమోనని భయపడుతున్న మనోజ్‌కు మీనా, శృతి, బాలు, సత్యం ధైర్యం చెబుతారు. కుటుంబం అంటే కష్టసమయంలో ఒకరికి ఒకరు అండగా నిలబడటమేనని సత్యం చెప్పిన మాటలు ఎమోషనల్‌గా నిలిచాయి. ఇదే సమయంలో పోలీసులు ఆస్పత్రికి వచ్చి ప్రమాదంపై విచారణ చేయగా, రూ.30 లక్షలు మోసం చేసిన విల్లా విజయ్‌ను వెంబడించే క్రమంలోనే యాక్సిడెంట్ జరిగిందని మనోజ్ వెల్లడిస్తాడు. మరోవైపు రోహిణి, అవసరమైతే తన కళ్లు ఇచ్చైనా మనోజ్‌కు చూపు తీసుకొస్తానని చెప్పి అతడికి ధైర్యం నింపుతుంది.

స్టార్ హీరోల సినిమాలపై మాధవిలత ఫైర్.. హీరోయిన్లు కేవలం దానికోసమేనంటూ..
స్టార్ హీరోల సినిమాలపై మాధవిలత ఫైర్.. హీరోయిన్లు కేవలం దానికోసమేనంటూ..

ఇంట్లో ప్రభావతి మరోసారి మీనాపై ఆరోపణలు చేయగా, సత్యం, శృతి గట్టిగా ఎదురు నిలుస్తారు. మనోజ్ చికిత్స కోసం రూ.2 లక్షలకు పైగా ఖర్చు బాలు, మీనానే భరించారని చెప్పడంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది. అనంతరం డాక్టర్లు మనోజ్ కళ్లకు కట్టిన బ్యాండేజ్ విప్పి పరిస్థితి బాగానే ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటారు. అయితే ఆస్పత్రి బిల్లు బాలు చెల్లించాడని తెలిసినా, మనోజ్ అతడిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తాడు. ఖర్చులపై ఆధారాలు చూపాలని డిమాండ్ చేయడంతో బాలు, మీనా తీవ్ర అసహనానికి గురవుతారు. ఈ ఉద్రిక్త పరిస్థితులతో ఎపిసోడ్ ముగిసింది.

సునీల్‌తో నాకు ఉన్న సంబంధం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా షాకింగ్ కామెంట్స్..
సునీల్‌తో నాకు ఉన్న సంబంధం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా షాకింగ్ కామెంట్స్..

శుక్రవారం ఎపిసోడ్‌లో కామెడీ, ఎమోషన్‌తో పాటు కుటుంబ కలహాలు ఆసక్తికరంగా సాగాయి. హాస్పిటల్‌లో తనను అందరి ముందు దొంగలా అవమానించిన మనోజ్‌పై బాలు తీవ్ర ఆగ్రహంతో ఉంటాడు. రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి సహాయం చేసినా తనను అనుమానించడంతో బాధపడిన బాలు, మనోజ్ కళ్లకు కట్టిన బ్యాండేజ్ మరో రెండు రోజులు తీయొద్దని నర్సును ఒప్పిస్తాడు. దీంతో మనోజ్ మరింత అనుమానాలకు గురవుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాలు తన చిలిపి పనులతో మనోజ్‌ను ఆటపట్టిస్తూనే ఉంటాడు. గేట్‌కు ఢీకొని పడిపోయిన మనోజ్‌కు హారతి ఇస్తున్న సమయంలో చేయి కాలేలా చేయడం, టిఫిన్‌లో ఇడ్లీకి పచ్చిమిర్చి పెట్టడం వంటి ఘటనలు నవ్వులు పంచుతాయి.

అక్కడ ఏం చేసినా వెన్నుపోటే అంటారు.. బిగ్‌బాస్‌పై నిఖిల్ షాకింగ్ కామెంట్స్!
అక్కడ ఏం చేసినా వెన్నుపోటే అంటారు.. బిగ్‌బాస్‌పై నిఖిల్ షాకింగ్ కామెంట్స్!

అయితే వీటన్నింటికీ బాలు, మీనాలే కారణమంటూ మనోజ్ ఆరోపిస్తాడు. హాస్పిటల్ బిల్లుల విషయంలో కూడా మోసం జరిగిందని రోహిణితో అనుమానాలు వ్యక్తం చేస్తాడు. మరోవైపు రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఆమె తల్లి శోభన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే శ్రుతి ఈ ఉద్యోగం తన ఇష్టంతో చేస్తున్నానని స్పష్టం చేస్తుంది. చివర్లో మనోజ్ మరోసారి బాలు ఆస్తి కోసం నాటకం ఆడుతున్నాడంటూ ప్రభావతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభావతి ఈసారి మనోజ్‌కే క్లాస్ తీస్తుంది. చివరగా బాలు చేసిన చిలిపి అల్లరితో ఎపిసోడ్ సరదాగా ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X