Janaki Kalaganaledu Weekly Roundup: జానకి కోసం భార్యపై గోవిందరాజులు సీరియస్.. జ్ఞానాంబ అప్సెట్

జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జూన్ 7 నుంచి జూన్ 10 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

జూన్ 7వ ఎపిసోడ్: ఇక మరోవైపు గోవిందరాజులు భార్య జ్ఞానాంబ పై అసంతృప్తి తో ఉంటాడు. ఆమె కూడా భర్త మాట్లాడిన విధానంపై కూడా ఏమాత్రం సంతోషంగా ఉండదు. జానకి తల్లి కావాలి అని ఆమె కోరుకుంటూ ఉంటుంది. కానీ అలా తొందర పెట్టవద్దని గోవిందరాజులు ఆమెకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక జానకి మందులు వేసుకుందా అని మరోసారి జ్ఞానాంబ అడుగుతుంది.

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 June 7th to June 10th Episode

కానీ ఆమె మర్చిపోయాను అని చెప్పడంతో మళ్ళీ అత్తగారు సీరియస్ అవుతారు. ఇక వెంటనే నేను మళ్ళీ టాబ్లెట్స్ తెస్తాను అని లోపలికి వెళ్ళిన జ్ఞానాంబ తన ముందే టాబ్లెట్స్ వేసుకోవాలి అని చెబుతుంది. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

జూన్ 8వ ఎపిసోడ్: ఇక తర్వాత జానకి మళ్ళీ తన చదువుపై ఫోకస్ చేయాలని అనుకుంటుంది. అలాగే జానకి రామచంద్ర కు భోజనం వడ్డించేటప్పుడు మరొక విషయం గురించి మాట్లాడుతుంది. మనకు ఎవరైనా అనాధ పిల్లలని దత్తత తీసుకుందామని ఆలోచనను బయటపడుతుంది. మళ్ళీ నాకు భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవచ్చు అని ఆమె కొంత అనుమానంగా మాట్లాడుతుంది.

దీంతో రామచంద్ర మళ్ళీ వెంటనే అదేంటి అలా మాట్లాడుతారు నేను ఇప్పటికి కూడా మనకు పిల్లలు పుడతారు అని అనుకుంటున్నాను అని చెబుతాడు. మరి ఆ మాటలకు జానకి ఏ తరహాలో రియాక్ట్ అవుతుందో చూడాలి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 June 7th to June 10th Episode

జూన్ 9వ ఎపిసోడ్: ఇక జానకి అప్పుడే రామచంద్ర బాధపడుతున్నట్లుగా తెలుసుకుంటుంది. ఇక ఇంటి దగ్గర తల్లిదండ్రులు వారి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత అడిగినప్పటికీ కూడా రామచంద్ర నిజం చెప్పడు. అలా సరదాగా ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వచ్చాను అని అంటాడు. ఇక జానకి ప్రత్యేకంగా రామచంద్ర కోసం భోజనం తీసుకువస్తుంది. అతనికి తన చేతులతో తినిపించాలని అనుకుంటుంది.

నా కడుపు పండే వరకు మీరే నా చంటి పిల్లాడు అని అంతే కాకుండా జానకి ఒక పాపను మనము దత్తత తీసుకుందామని చెప్పడంతో రామచంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వెంటనే మనకు పిల్లలు తప్పకుండా పుడతారు అని నేను అనుకుంటున్నాను అని రామచంద్రా మళ్ళీ చెబుతాడు. ఇక జానకి కూడా షాక్ అవుతుంది ఇక మరోవైపు గోవిందరాజులు కొడుకు విషయంలో ఆలోచించి జానకిని ఇబ్బంది పడకుండా చేయాలి అని అనుకుంటాడు. మరి ఆయన రామతో ఏ విధంగా మాట్లాడతారో చూడాలి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

Janaki Kalaganaledu Serial Weekly Roundup: 2023 June 7th to June 10th Episode

జూన్ 10వ ఎపిసోడ్: ఇక బాధతో జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనంతరం ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. కొడుకు వచ్చి తల్లి ఒళ్ళో పడుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె మాత్రం అసహనంతో వెళ్లి మీ నాన్న దగ్గర పడుకొని మీ అమ్మ గురించి ఆయనకు చెప్పు అని అంటుంది. నాకు నీ ఒడిలోనే పడుకోవాలని ఉంది అని రామచంద్ర చెబుతాడు. కానీ ఆమెకు మాత్రం సంతోషంగా కనిపించదు. ఇక ఈ తరుణంలో ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు జానకి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. పూర్తి స్టోరి వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X