X
తెలుగు » సినిమాలు » వకీల్ సాబ్
వకీల్ సాబ్

వకీల్ సాబ్

Drama | 09 Apr 2021 | U/A | 155 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

వకీల్ సాబ్ స్టోరీ

వకీల్ సాబ్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .  హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌ వకీల్ సాబ్. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు, బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మించారు. తమన్ సంగీతం అందించారు. కథ పల్లవి (నివేదా థామస్), జరీనా (అంజలి), దివ్య నాయక్ (అనన్య నాగళ్ల) హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్. నగరానికి దూరంగా కారు పాడవడంతో ఈ ముగ్గురు యువతులు ఎంపీ రాజేంద్ర (ముఖేష్ రుషి) బంధువు వంశీతోపాటు మరో ఇద్దరు యువకులను కలుస్తారు. ప్రకృతి అనే రిస్టారుకు వెళ్లిన సమయంలో జరిగిన గొడవలో వంశీ గాయపడటం, ముగ్గురు యువతులు అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపీ మనుషులు ముగ్గురు యువతులపై అక్రమ కేసులు బనాయించడంతో కోర్టులో సస్పెండ్ అయిన వకీల్ సాబ్ సత్యదేవ్‌ (పవన్ కల్యాణ్) కలుస్తారు.  ప్రకృతి అనే రిసార్డులో వంశీ బ్యాచ్‌కు ముగ్గురు యువతులకు మధ్య ఏం జరిగింది? వంశీ తలకు బలమైన గాయం ఎందుకైంది. ఎంపీ రాజేంద్ర వర్గం ముగ్గురు యువతులపై ఎందుకు కేసులు పెట్టారు. ఏ పరిస్థితుల్లో సత్యదేవ్‌ను ముగ్గురు అమ్మాయిలు సహాయం కోరుతారు. ఈ కేసులో టాప్ లాయర్‌ నంద గోపాల్ (ప్రకాశ్ రాజ్)ను ఎందుకు రంగంలోకి దించాల్సి వచ్చింది. కోర్టులో రాజేంద్ర, సత్యదేవ్‌కు మధ్య ఎలాంటి వాదనలు జరిగాయి. ఈ కథలో శృతి హాసన్ పాత్ర ఏమిటి? చివరకు న్యాయం, ధర్మం ఎవరివైపు నిలబడిందనే ప్రశ్నలకు సమాధానమే వకీల్ సాబ్ సినిమా కథ.
Read More

వకీల్ సాబ్ కాస్ట్ & క్రూ

వకీల్ సాబ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వేణు శ్రీరామ్
సినిమాటోగ్రఫీ పి ఎస్ వినోద్
సంపాదకుడు ప్రవీన్ పుది
సంగీతం తమన్ యస్
నిర్మాత బోనీ కపూర్, దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వకీల్ సాబ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మహిళా సాధికారితతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సమస్యలకు వేలెత్తి చూపి పొలిటికల్ కలర్ ఉన్న సినిమా వకీల్ సాబ్. పక్కాగా పింక్ కథను కాకుండా పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని చేసిన చిత్రంగా కనిపిస్తుంది. ఫ్యాన్స్‌కు, సగటు ప్రేక్షకులకు ఇది ఫుల్ మీల్స్ లాంటి చిత్రమని చెప్పవచ్చు. డైలాగ్స్, సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఇక ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైన కారణంగా రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. రానున్న రోజుల్లో ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో బాక్సాఫీస్ వద్ద నమోదయ్యే వసూళ్లే ప్రమాణికంగా నిలువనున్నాయి.

వకీల్ సాబ్ ట్రైలర్

Video Thumbnail

వకీల్ సాబ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వకీల్ సాబ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+