X
తెలుగు » సినిమాలు » సర్దార్ గబ్బర్ సింగ్
సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

Action | Romance | 08 Apr 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సర్దార్ గబ్బర్ సింగ్ స్టోరీ

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, కబీర్ దుహాన్ సింగ్, చరణ్ రాజ్, సంజన గిల్రాణి, ఉర్వశి, షకలక శంకర్, నర్సింగ్ యాదవ్, వేణు (జబర్ దస్థ్), రావు రమేష్, పోసాని మురళి కృష్ణ, తనికెళ్ళ భరణి, రఘు బాబు తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత శర్రత్ మారర్ నిర్మించారు ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. కథ రత్తన్ పూర్ ప్రాంత రాజకుటుంబానికి చెందిన భైరవ్ సింగ్ (శరద్ కెల్కర్) ఓ కిరాతుకుడు. ఆ ప్రాంతంలోని మైనింగ్ ని చేజిక్కించుకోవటం కోసం...పంట భూములను అక్రమంగా ఆక్రమించుకుని రైతులును ఇబ్బందులు పెడుతూ...ఊరిని నాశనం చేస్తూంటాడు. మరో ప్రక్క అక్కడ రాజ సంస్థానంలో అప్పుల్లో కూరుకుపోయి.. ఆ సంస్థానానికి సంబందించిన ఛారిటిలు నడపటం కోసం...తమ ఇంట్లో వస్తువులను అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఆ కుటుంబీకులు ఉంటారు. తమ రాజమహల్ ని ఓ హోటల్ వారికి అప్పగించేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయని ఆ కుటుంబం భావిస్తుంది. అయితే భైరవ్ సింగ్ మాత్రం ఆ ప్రయత్నం ముందుకు సాగనీయడు. అప్పుడు సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ (పవన్‌ కల్యాణ్‌) సీఐగాఆ ప్రాంతానికి ట్రాన్సఫర్ పై వస్తాడు. నానా ఇబ్బందుల్లో, దుస్దితిలో ఉన్న రతన్‌పూర్‌ ని, ఆ రాజకుటుంబాన్ని ఎలా భైరవ్ సింగ్ కబంధ హస్తాల నుంచి కాపాడాడు.. అడుగడుగునా అడ్డుపడే భైరవ్ సింగ్ నుంచి తప్పించుకుంటూ...అక్కడి సమస్యల్ని ఎలా తీర్చాడు అన్నదే సర్దార్‌ కథ.
Read More

సర్దార్ గబ్బర్ సింగ్ కాస్ట్ & క్రూ

సర్దార్ గబ్బర్ సింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవింద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత శర్రత్ మరర్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సర్దార్ గబ్బర్ సింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పవన్‌ కల్యాణ్‌ సినిమాలో హీరోయిన్‌ లేకపోయినా ఫర్వాలేదు కానీ గన్నులూ, గుర్రాలూ ఉండాల్సిందే. తన సినిమాల్లో బుల్లెట్ల వర్షం కురిపించడం, స్టైల్‌గా గుర్రాన్ని నడిపించుకొంటూ రావడం పవన్‌కి సరదా. 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'లోనూ అంతే జరిగింది. అదొక్కటే హైలెట్ అయ్యేలా చూసుకున్నారు. పవన్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ స్దాయిలో ఉంటుదంనుకుని వచ్చినవాళ్లకు ఆ సినిమాలో సగం కూడా లేకోపోవటం నిరాశ కలిగించే అంశం. ఈ పోలిక రావటానికి కారణం..సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్రాంచైజ్ కావటమే. ఇక వెస్ట్ర్రన్ సినిమాలను తలపిస్తూ...కౌబాయ్ లుక్ తో పవన్ చేసే విన్యాసాలు బాగున్నాయి. అయితే వచ్చిన ఇబ్బంది అంతా...దాదాపు అవే సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్.... వీణ స్టెప్పు వేయడం, శంకర్ దాదా ఎంబీబియస్ మూవ్ మెంట్స్ ...మెగా ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది. కాకపోతే పవన్ వంటి పవర్ స్టార్ శ్రీను వైట్ల సినిమా తరహాలో ఎపిసోడ్స్ డిజేన్స్ చేస్తూ నడపాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది. కంటెంట్ లేనప్పుడు కటౌట్స్ ఎన్ని ఉంటే ఉపయోగముంటుంది అన్నట్లు సినిమాలో కంటెంట్ విషయంలో సినిమా మొదటనుంచీ రాంగ్ స్టెప్స్ పడుతూ వచ్చాయి. దాంతో పవన్ ఎంత సినిమాని మోద్దామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సర్దార్ గబ్బర్ సింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+