X
ఆరెంజ్

ఆరెంజ్

Romance | 26 Nov 2010 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఆరెంజ్ స్టోరీ

ఆరెంజ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ , బ్రహ్మానందం, ప్రకష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, స్క్రీన్,ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత కె నాగేంద్ర బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హ్యారీస్ జయరాజ్ స్వరాలు సమకుర్చరు. కథ జీవితాంతం ఒకే వ్యక్తితో ప్రేమలో ఉండటం అనేది అబద్దమని,ఎప్పుడూ ఎవరో ఒక కొత్త అమ్మాయిలని వెతుక్కునే కుర్రాడు రామ్ (రామ్ చరణ్). సిడ్నీ(ఆస్ట్రేలియా) లో గ్రాఫిటీ ఆర్టిస్టు అయిన అతను తాను నమ్మిన ఫిలాసపీని ప్రమోట్ చేసుకుంటూ రెగ్యులర్ గా అమ్మాయిలతో ప్రేమలో పడుతూ లేస్తూ హ్యాపీగా గడిపిస్తూంటాడు.తొమ్మిది మందితో ప్రేమాయణాలు పూర్తి చేసిన అతనికి పదో అమ్మాయిగా పూర్తి భిన్నమైన జానికి(జెనీలియా) పరిచయం అవుతుంది. మొదట్లో ప్రేమలో పడినా ఆ తర్వాత అతని మెంటాలిటీని జీర్ణించుకోలేక విడిపోతుంది. ప్రేమించే వ్యక్తిని అలా చేయి..ఇలా ఉండు అని చెప్పటమే తప్పని వాదించే రామ్ ఆ స్ధితిలో ఏం నిర్ణయం తీసుకున్నాడు..వారిద్దరూ ఎలా కలిసారనేది మిగతా కథ.
Read More

ఆరెంజ్ కాస్ట్ & క్రూ

ఆరెంజ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం భాస్కర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత నాగేంద్ర బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆరెంజ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
"మగధీర" వంటి సంచలన విజయం తర్వాత రామ్ చరణ్ చేసే సినిమాపై ఏ రేంజి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయో తెలిసే భాస్కర్ కి అప్పచెప్పారంటే ఆ కథ ఓ రేంజిలో ఉండి ఉంటుందని అందరూ ఎంతో ఎక్సపెక్ట్ చేసారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ ఆరెంజ్ ఓ రేంజి వాదోపవాదాలతో ధియోటర్స్ లో దిగింది. అప్పటికీ అన్ని వర్గాలను ఆకర్షించాలనేమో గాని అనవరసరమైన ఫైట్స్, కథకు సంభంధం లేని బ్రహ్మనందం కామిడీ వంటి మషాలాలు కలిపారు. కానీ విషయం తక్కువ అవటంతో విశ్లేషణ ఎక్కువై విసుగు తెప్పించింది. ఎత్తుకున్న పాయింట్ పై దర్శకుడు కన్ఫూజన్ మొత్తం ప్రేక్షకుడుకి మెగా కన్ఫూజన్ గా మారిపోయింది. రామ్ చరణ్ కొత్త లుక్ తో కనపించటం,పాటలు ఈ సినిమాని ఆ మాత్రమైనా భరించేలా చేసాయి.

ఆరెంజ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆరెంజ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+