twitter
    CelebsbredcrumbGunasekhar
    గుణశేఖర్

    గుణశేఖర్

    Director/Producer
    Born : 02 Jun 1978
    Birth Place : హైదిరాబాద్
    గుణశేఖర్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత 1978 జూన్ 2న నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు.  1977 లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను... ReadMore
    Famous For
    గుణశేఖర్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత 1978 జూన్ 2న నర్సీపట్నం, ఆంధ్ర ప్రదేశ్ లో జన్మించారు.  1977 లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాల రామాయణం జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా పురస్కారాన్ని అందుకోవడమే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు నంది పురస్కారాలను అందుకుంది.

    2003 లో అతను దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా 8 నంది అవార్డులనూ, ఉత్తమ దర్సకుడి పురస్కారంతో పాటు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత అర్జున్, సైనికుడు, మృగరాజు, చూడాలని వుంది, వరుడు, నిప్పు, సొగసు చూడ తరమా, లాఠీ లాంటి సినిమాలు తీసాడు.  2015 లో విడుదలైన చారిత్రాత్మక సినిమా రుద్రమదేవి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొంది చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది.
    Read More
    • మధుర గతమా వీడియో సాంగ్
    • శాకుంతలం మూవీ ట్రైలర్
    • ఏలేలో ఏలేలో లిరికల్ సాంగ్
    • మల్లికా మల్లికా లిరికల్ సాంగ్
    • శాకుంతలం మూవీ ట్రైలర్
    • 1
      కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు గుణశేఖర్.
    • 2
      దర్శకుడిగా మారక ముందు ప్రముఖ రచతలు డీవీ నరస రాజు, ప్రముఖ దర్శకులు క్రాంతి కుమార్, రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసారు.
    • 3
      దర్శకుడిగా గుణశేఖర్ మొదటి చిత్రం 1992లో ‘లాఠీ’ చిత్రం. ప్రశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన దర్శకుడిగా గుణశేఖర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత నరేష్, ఇంద్రజ హీరో, హీరోయిన్లుగా ‘సొగసు చూడతరమా’ అనే సినిమాను తెరకెక్కించారు. హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇన్‌సిడెంట్ ప్రపోజల్’ మూవీని తెలుగు నెటివిటీకి తగ్గట్టు తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకున్నారు.
    • 4

      సొగసు చూడతరమా సినిమాతో ఉత్తమ చిత్రంగా నంది అవార్డుతో పాటు ఉత్తమ నటుడిగా నరేష్ నంది అవార్డు అందుకున్నారు.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో అంతా చిన్నపిల్లలతో గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమా దర్శకుడిగా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది.
    • 5
      చిరంజీవితో ‘చూడాలనివుంది’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నారు. ఆ తర్వాత తీసిన ‘మృగరాజు’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది.
    • 6
      ఈ రెండు సినిమాల మధ్యలో ‘మనోహరం’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో జగపతి బాబు ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటు ఉత్తమ చిత్రంగా నిలిచింది.ఈ చిత్రానికి గాను ఉత్తమ స్టోరీ రచయతగా గుణశేఖర్‌కు మరో నంది అవార్డు కూడా వచ్చింది.ఇక మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘ఒక్కడు’ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొండారెడ్డి బురుజు సన్నివేశం ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వరుసగా మహేష్ బాబుతో ‘అర్జున్’, ‘సైనికుడు’ సినిమాలు తెరకెక్కించాడు. ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలను అందుకోలేదు.
    • 7
      ఆ తర్వాత అల్లు అర్జున్‌తో తీసిన ‘వరుడు’ సినిమాతో పాటు రవితేజతో తీసిన ‘నిప్పు’సినిమాలు గుణశేఖర్‌కు తీవ్ర నిరాశకు గురిచేసాయి. 2015లో అనుష్క ప్రధాన పాత్రలో అల్లు అర్జున్, రానాలతో తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గుణశేఖర్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా చివరన ‘ప్రతాప రుద్రుడు’ సినిమా తీస్తున్నట్టు చెప్పినా.. ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టారు. అంతేకాదు అప్పట్లో ఎన్టీఆర్‌తో ప్రతాప రుద్రుడు’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రానా హీరోగా భారీ ఎత్తున ప్యాన్ ఇండియా లెవల్లో‘హిరణ్యకశ్యప’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగులో రెండు ‘భక్త ప్ర
    • 8

      సమంతతో ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌కు కొద్దిగా కంప్లీట్ చేసారు గుణ శేఖర్.
    గుణశేఖర్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X