X
తెలుగు » సినిమాలు » ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి)
ఎంసీఏ

ఎంసీఏ

Romance | 21 Dec 2017 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

ఎంసీఏ స్టోరీ

ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, భూమిక చావ్లా, రాజీవ్ కనకాల, నరేష్ తదితరులు నటింటారు. ఈ సినిమాకి దర్శకత్వం వేణు శ్రీరామ్ వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.  కథ నాని (నాని) మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడు. తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల అన్నయ్య (రాజీవ్ కనకాల) అతనికి సర్వస్వం. అన్నయ్య జీవితంలో జ్యోతి (భూమిక చావ్లా) భార్యగా ప్రవేశించడంతో కొంత వారి మధ్య దూరం పెరుగుతుంది. వదిన కారణంగానే అన్నయ్య దూరమయ్యాడనే ఫీలింగ్‌లో ఉంటాడు నాని. ఇంతలో అన్నయ్య ఉద్యోగ శిక్షణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లడం, రవాణాశాఖలో పనిచేసే జ్యోతికి వరంగల్ ట్రాన్స్‌ఫర్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నాని కూడా వదినతో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. వరంగల్‌లోనే పల్లవి (సాయి పల్లవి)ని చూసి ప్రేమలో పడిపోతాడు. తొలిచూపులోనే పల్లవి పెళ్లీ చేసుకొందామని ప్రపోజ్ చేస్తుంది. ఇలా కథ సాగుతున్న తరుణం శివశక్తి ట్రావెల్స్ యజమాని శివకు జ్యోతికి మధ్య వైరం కలుగుతుంది. ఆక్రమంలో జ్యోతిని శివ చంపబోతుండగా నాని అడ్డుకొంటాడు. కానీ ఎలాగైన జ్యోతిని చంపుతానని శివ శపథం చేస్తాడు. శివతో వైరం పెరుగడానికి కారణం ఏమిటి? ఈ పరిస్థితుల్లో వదినను ఎలా రక్షించుకొన్నాడు? తొలిచూపులోనే సాయి పల్లవి పెళ్లి ప్రపోజ్ చేయడానికి వెనుక ఉన్న కారణం ఏమిటీ? ఏ ఉద్యోగం, పనిపాట లేకుండా తిరిగే నానికి పల్లవితో పెళ్లి కుదిరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్ర కథ.
Read More

ఎంసీఏ కాస్ట్ & క్రూ

ఎంసీఏ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వేణు శ్రీరామ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎంసీఏ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఓ మై ఫ్రెండ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరాం మరో ఐదేళ్ల తర్వాత మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలలతో ఎంసీఏ కథను అల్లుకొన్నాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించించే నాని కథానాయకుడిగా ఎంపిక చేసుకొన్నాడు. వదిన, మరిది మధ్య రిలేషన్స్‌ను కథకు జోడించాడు. వదిన కోసం మరిది, మరిది కోసం వదిన పడే ఆరాటంతో కథను నడిపించాడు. తొలి భాగంలో కథను ఆసక్తిగా నడిపిన దర్శకుడు.. రెండో భాగంలోకి వచ్చే సరికి తడబడినట్టు కనిపిస్తాడు. నాని, భూమిక, సాయి పల్లవి లాంటి బలమైన పాత్రల మధ్య దర్శకుడు కొంత నలిగిపోయాడనే చెప్పవచ్చు. అన్ని పాత్రల్లో సమతూకం పాటించడానికి నానా కష్టాలు పడి రెండో భాగంలో గందరగోళానికి గురయ్యాడనిపిస్తుంది. ఇక శివ విలన్ పాత్ర మధ్యలో అతికించినట్టుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ పాత్రకు విజయ్ లాంటి వ్యక్తి ఎంచుకోవడం కొంత మైనస్‌గానే ఉంటుంది. బలమైన విలన్ ఉంటే స్టోరీ ఫ్లేవర్ తగ్గుతుందనే భావనతో విలన్ పాత్రను అండర్ ప్లే చేశాడా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్‌గా సెకండాఫ్‌లో రొటీన్ సీన్లు, బలహీనమైన కథనంతో అందరిని సంతృప్తి పరిచే శుభం కార్డు వేయడానికి నానా కష్టాలే పడ్డాడానే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.

ఎంసీఏ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

ఎంసీఏ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+