జన నాయగన్'లో పూజా హెగ్డేకు అన్యాయం .. రిలీజ్‌కు ముందే డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నసినిమా 'జన నాయగన్'. విజయ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత వస్తున్న తొలి సినిమా.. అలాగే ఆయన హీరోగా నటించిన చివరి సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు హెచ్. వినోద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర గురించి ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.
రిలీజ్‌కు ముందే పూజా పాత్రపై క్లారిటీ
'జన నాయగన్'లో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపిస్తారని అభిమానులు భావించారు. అయితే దర్శకుడు హెచ్. వినోద్ మాత్రం సినిమాలో ఆమెకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండదని స్పష్టం చేశారు. స్క్రిప్ట్ రాసినప్పుడు పూజా పాత్రను చాలా పెద్దదిగా డిజైన్ చేశామని, కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని కీలక సీన్స్ ను షూటింగ్ చేయలేకపోయామని వెల్లడించారు. "సారీ పూజా" అంటూ ఆమెకు బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పారు.

తెలుగులో భారీ విజయం సాధించిన 'భగవంత్ కేసరి' కథను ఆధారంగా చేసుకుని 'జన నాయగన్'ను రూపొందించినట్లు దర్శకుడు అంగీకరించారు. అయితే ఇది పూర్తి రీమేక్ కాదని, కథలో అనేక మార్పులు చేసినట్లు వివరించారు. తెలుగు వెర్షన్‌లో కాజల్ అగర్వాల్ డాక్టర్ పాత్రలో కనిపించగా, తమిళ వెర్షన్‌లో పూజా హెగ్డే ప్రెస్ రిపోర్టర్‌గా నటించినట్లు తెలిపారు. విజయ్‌తో ఆమెకు రొమాంటిక్ ట్రాక్ లేదని కూడా స్పష్టం చేశారు.
హెచ్. వినోద్ ప్రకారం.. 'భగవంత్ కేసరి' కథలోని కొన్ని ప్రధాన అంశాలను మాత్రమే తీసుకున్నారట. ఫస్ట్ హాఫ్‌లో సుమారు 60 శాతం, సెకండ్ హాఫ్‌లో 20 శాతం మాత్రమే పోలికలు ఉంటాయని చెప్పారు. మొత్తం మీద ఒరిజినల్ కథ నుంచి దాదాపు 50 శాతం మాత్రమే ఉపయోగించి, మిగతా భాగాన్ని పూర్తిగా కొత్తగా రూపొందించినట్లు వెల్లడించారు.
రాజకీయాలపై దర్శకుడి క్లారిటీ
'జన నాయగన్'పై రాజకీయ ప్రచారం ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు మరో కీలక విషయం చెప్పారు. ఈ సినిమాలో రాజకీయాలు ఉంటాయని, కానీ ఏ వ్యక్తిని లేదా ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, ఐక్యత, ప్రజల కోసం పనిచేయాలనే సందేశంతో కథ సాగుతుందని వెల్లడించారు. సినిమా టైటిల్ కూడా అదే ఆలోచనతో ఎంపిక చేశామని చెప్పారు. ట్రైలర్‌లో విజయ్ చూపించిన చేతి స్లాష్ జెశ్చర్‌పై కూడా దర్శకుడు స్పందించారు. ఆ జెశ్చర్ కథకు చాలా అవసరమని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే దాని ప్రాముఖ్యత అర్థమవుతుందని చెప్పారు. ముందుగానే దాని గురించి వివరణ ఇవ్వడం సరైనది కాదన్నారు.
సెన్సార్ ఆలస్యం.. లీక్‌తో మరో షాక్
ఈ సినిమా మొదట జనవరిలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సెన్సార్ ప్రక్రియ కారణంగా చాలా నెలలు ఆలస్యమైంది. ఆ సమయంలో సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రబృందానికి మరో పెద్ద షాక్‌గా మారింది. చివరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి 'A' సర్టిఫికెట్ లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.
విజయ్ చివరి చిత్రం కావడం, రాజకీయ నేపథ్యం, భారీ తారాగణం, హెచ్. వినోద్ దర్శకత్వం వంటి అంశాలతో 'జన నాయగన్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తుండగా, మమిత బైజు, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నారేన్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విడుదల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications




