Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan: కోలీవుడ్ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయగన్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టిన విజయ్‌కు ఇది చివరి సినిమా కావడంతో ఈ రిలీజ్‌ను అభిమానులు ఓ సినిమా విడుదలగా కాకుండా.. ఒక ఎమోషనల్ ఫేర్‌వెల్‌గా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ ఉంది అనే విషయాల్లోకి వెళితే..
దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా.. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్, రేవతి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ స్థాయిలో నిర్మించారు.

500 కోట్ల భారీ బడ్జెట్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. నటీనటుల రెమ్యునరేషన్లు, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, విదేశాల షూటింగ్, సాంకేతిక నిపుణుల ఖర్చులు, ప్రమోషన్స్ అన్నీ కలిపి ఈ వ్యయం జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ ప్రక్రియలో ఎదురైన జాప్యం కారణంగా విడుదల వాయిదా పడింది. దాదాపు ఆరు నుంచి ఏడు నెలల తర్వాత ఇప్పుడు జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఆలస్యంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. నిర్మాత వెంకట్ కె. నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. 'జన నాయగన్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో విడుదల చేస్తున్నారు. దాదాపు 8000 స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళ సినిమాకు ఇంత భారీ విడుదల అరుదుగా జరుగుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కేరళలో విజయ్ క్రేజ్ మామూలు కాదు..
విజయ్‌కు తమిళనాడుతో పాటు కేరళలో కూడా భారీ అభిమాన వర్గం ఉంది. అందుకే అక్కడ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే రికార్డు స్థాయి స్పందన కనిపించింది. ట్రేడ్ సమాచారం ప్రకారం.. కేవలం రెండున్నర గంటల్లోనే కేరళలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఒక కోటి రూపాయల గ్రాస్ దాటింది. ఇది విజయ్ మార్కెట్‌కు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. జూలై 23న కేరళలో ఉదయం 6 గంటలకే ఫస్ట్ షోలు ప్రారంభం కానున్నాయి. అభిమాన సంఘాలు భారీ కటౌట్లు, బ్యాండ్లు, బాణాసంచాతో విడుదలను పండుగలా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
కర్ణాటకలోనూ అదే జోరు
కేవలం తమిళనాడు, కేరళ మాత్రమే కాదు.. కర్ణాటకలో కూడా అడ్వాన్స్ బుకింగ్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. ఇప్పటికే అక్కడ రెండు కోట్ల రూపాయలకు పైగా ప్రీ-సేల్స్ నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా టికెట్ల కోసం భారీ డిమాండ్ కనిపిస్తోంది.
విజయ్ 'లియో' కేరళలో విడుదల రోజే దాదాపు 12 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మొత్తం రన్‌లో అక్కడ దాదాపు 60 కోట్ల రూపాయల నెట్ సాధించింది. ఇప్పుడు అదే రికార్డును 'జన నాయగన్' అధిగమిస్తుందా? అనే చర్చ మొదలైంది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. 'లియో' ఓపెనింగ్‌ను అధిగమించడం కాస్త కష్టమే అయినా, భారీ వసూళ్లు మాత్రం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
300 కోట్ల తొలి రోజు?
బాక్సాఫీస్ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న అతిపెద్ద చర్చ తొలి రోజు కలెక్షన్ల గురించే. కొన్ని ట్రేడ్ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది అధికారిక అంచనా కాకపోయినా.. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ చూస్తే భారీ ఓపెనింగ్ ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమిళనాడులో విడుదలైన తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు హౌస్‌ఫుల్ షోలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లోనే తమిళనాడులో 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదలకు ముందే కనిపిస్తున్న ఈ క్రేజ్ చూస్తే.. 'జన నాయగన్' బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications





