70 ఏళ్లు పూర్తి చేసుకొన్న త్రిష తల్లి.. కూతురును మించిన గ్లామర్‌పై నెటిజన్ల ఫిదా

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్ల సక్సెస్ వెనుక వారి కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా తల్లి పాత్ర ఎంతో కీలకం. బిడ్డ ఎక్కడికి వెళ్లినా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి ఎదుగుదలను చూసి మురిసిపోయిన మాతృమూర్తులు ఎందరో. ఈ కోవలోకే వస్తారు కోలీవుడ్ అగ్రనటి త్రిషా కృష్ణన్ తల్లి ఉమా కృష్ణన్. దక్షిణాదితో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోని టాప్ హీరోయిన్‌గా, అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్స్‌లో ఒకరిగా నేడు త్రిష ఎదిగిన సంగతి తెలిసిందే. దీని వెనుక ఉమా కృష్ణన్ కీలకపాత్ర పోషించారు. తాజాగా తన తల్లి 70వ పుట్టినరోజును పురస్కరించుకుని త్రిష ఘనంగా సెలబ్రెట్ చేశారు.

Also Read
Rao Bahadur Overseas Day 1 Collection: రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?
Rao Bahadur Overseas Day 1 Collection: రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

4 మే 1983న కృష్ణన్, ఉమా దంపతులకు చెన్నైలో జన్మించారు. వీరిది తమిళ్ పాలక్కాడ్ అయ్యర్ కుటుంబం. త్రిష తండ్రి హోటల్ మేనేజ్‌మెంట్‌ రంగంలో చిరు ఉద్యోగిగా మొదలై.. అంచెలంచెలుగా టాప్ పొజిషన్‌కు వెళ్లారు. న్యూయార్క్‌లో పనిచేసే అవకాశం రావడంతో త్రిష కుటుంబం కొన్నాళ్లు అమెరికాలో ఉంది. అయితే చాలీ చాలని సంపాదన కారణంగా తిరిగి వీరి కుటుంబం మద్రాస్‌కు తిరిగొచ్చేసింది.

Trisha Krishnan celebrates her Mother Uma Krishnan 70th birthday

బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన త్రిష మోడలింగ్‌లోకి వెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మోడల్‌గా ప్రింట్, టెలివిజన్ కమర్షియల్స్‌లో నటించారు త్రిష. ఈ దశలో 1999లో మిస్ సేలం టైటిల్‌ను అందుకున్నారు త్రిష. అదే ఏడాది మిస్ చెన్నై‌గా గెలిచిన త్రిష.. అనంతరం 2001లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో బ్యూటీఫుల్ స్మైల్‌గా అవార్డ్ దక్కించుకోవడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

Recommended For You
'పెళ్లిపై నమ్మకం లేదు... అలాంటి వ్యక్తి దొరికితే అతనితో బిడ్డనుకంటా'
'పెళ్లిపై నమ్మకం లేదు... అలాంటి వ్యక్తి దొరికితే అతనితో బిడ్డనుకంటా'

క్రిమినల్ సైకాలజిస్ట్‌ కావాలని త్రిష ఎన్నో కలలు కన్నారు. కానీ విధి ఆమెను నటన వైపు నడిపించింది. 2000వ సంవత్సరంలో బాలీవుడ్ నటి ఆయేషా టాకియతో కలిసి ఫాల్గుణి పాఠక్ తెరకెక్కించిన మ్యూజిక్ ఆల్బమ్ మేరి చునార్ ఉద్ ఉద్ జాయేలో కనిపించారు. 2003లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన లెసా లెసా అనే తమిళ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. ఆమె అందం, నటన దర్శక నిర్మాతలను ఆకట్టుకోవడంతో త్రిషకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ దశలో షూటింగ్స్‌కి, కాలేజీలో క్లాసులకు అటెండ్ అయ్యేందుకు వీలుకాకపోవడంతో చదువును వదులుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే సమ్మర్ క్లాసులకు మాత్రం ఖచ్చితంగా హాజరయ్యారు త్రిష. జోడీ, సామీ, ఘిల్లీ, ఆరు, వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, కృష్ణ తదితర సినిమాలతో త్రిష దక్షిణాదిలో అగ్రనటిగా ఎదిగారు. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ టాప్ హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

You May Also Like
MIB Overseas Box Office Collections: మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
MIB Overseas Box Office Collections: మా ఇంటి బంగారం ఓవర్సీస్ కలెక్షన్ల రికార్డు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?

త్రిష తండ్రి కృష్ణన్.. 2012 అక్టోబర్ 19న హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కుమార్తె టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఆయన తన ఉద్యోగం వదిలిపెట్టకుండా కంటిన్యూ చేశారు. హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌‌లో త్రిష తండ్రి జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. గుండెనొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో హుటాహుటిన త్రిష, ఉమా హైదరాబాద్‌కు చేరుకుని కృష్ణన్ అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారు.

సొంత అన్నకి అలా శత్రువునయ్యా... బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ కంటతడి
సొంత అన్నకి అలా శత్రువునయ్యా... బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ కంటతడి

నాటి నుంచి కూతురే ప్రాణంగా బతుకుతున్నారు ఉమ. ఆమెకు అన్ని విషయాలో అండగా నిలిచి మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ త్రిష వెంట షూటింగ్స్‌కి, సినిమా ఈవెంట్స్‌కి ఇతర కార్యక్రమాలకు తోడుగా వెళ్తారు ఉమా కృష్ణన్. అంతేకాదు.. వీరిద్దరి కలిసి వాణిజ్య ప్రకటనలు కూడా చేయడం విశేషం. తొలినాళ్లలో ఉమ అందం, నటన పట్ల ఆమె అభిరుచిని చూసిన దర్శక నిర్మాతలు ఆమెను సినిమాలలో నటించాల్సిందిగా ఆఫర్లు కూడా ఇచ్చారు. కానీ తనకు కూతురి భవిష్యత్తే ముఖ్యమని ఈ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు.

భర్త చేతిలో అలా మోసపోయా... అమ్మాయిలతో హీరో ఎఫైర్లపై భార్య రియాక్షన్
భర్త చేతిలో అలా మోసపోయా... అమ్మాయిలతో హీరో ఎఫైర్లపై భార్య రియాక్షన్

త్రిష, ఉమాలు తల్లీకూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా, తోబుట్టువుల మాదిరిగా ఉంటారు. హోటల్స్, ఇతర ఈవెంట్స్‌లో తల్లితో కలిసి వెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు త్రిష. పలు సందర్భాలలో తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు త్రిష. నా కష్టసుఖాల్లో మా అమ్మ నాకు అండగా నిలిచారు. మా అమ్మతో నా రిలేషన్ గురించి చిత్ర పరిశ్రమలోని అందరికీ, నా సన్నిహితులకు తెలుసని త్రిష చెప్పేవారు. జూలై 23న ఉమా కృష్ణన్ 70వ పుట్టినరోజు. దీంతో తల్లి బర్త్ డేను త్రిష ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అవి చూసిన నెటిజన్లు ఉమాగారికి నిజంగా 70 ఏళ్లా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఫోటోలలో త్రిషకు ఆమె అక్కలా ఉన్నారు తప్పించి తల్లిలా లేరు. ఈ వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో వెలిగిపోతున్నారు ఉమ. బహుశా ఈ అందమే త్రిషకు కూడా వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: trisha krishnan uma krishnan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X