Spirit: ప్రభాస్ 'స్పిరిట్' లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. సందీప్ వంగా స్కెచ్ మామూలు లేదుగా..

Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోల్లో డార్లింగ్ ఒకరు. సలార్, కల్కి 2898 AD విజయాల తర్వాత ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న'స్పిరిట్'పై అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు మరింత పెరిగాయి.

Also Read
Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?
Lenin 9 Days BoxOffice: లెనిన్ బాక్సాఫీస్ స్టామినా ఇదే.. అఖిల్ అక్కినేని మూవీ ఎన్ని కోట్లంటే?

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారట.ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్, సిన్సియర్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. చట్టం విషయంలో ఎలాంటి రాజీ పడని అధికారిగా ప్రభాస్ కనిపిస్తారని తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు స్ట్రాంగ్ ఎమోషన్స్ కూడా కథలో కీలక పాత్ర పోషించనున్నాయని సమాచారం.

Spirit Interval Twist
Recommended For You
Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
Jana Nayagan Advance Booking: అడ్వాన్స్ బుకింగ్స్ లో 'జన నాయగన్'రికార్డు.. విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇదే సమయంలో సినిమా ఇంటర్వెల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమాచారం ప్రకారం.. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ ఓ క్లిష్టమైన కేసును ఛేదించే ప్రయత్నంలో ఉంటాడట. కానీ ఆ కేసు వెనుక దాగి ఉన్న అసలు నిజం ఇంటర్వెల్‌లో బయటపడుతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆ ట్విస్ట్ కేవలం క్రైమ్ కేసుతో మాత్రమే సంబంధం ఉండదని అంటున్నారు. హీరో వ్యక్తిగత జీవితానికి, అతడు వెతుకుతున్న విలన్‌కు మధ్య ఊహించని సంబంధం బయటపడుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

You May Also Like
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే?

ఈ ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండేలా సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా సెకండాఫ్‌లో ప్రభాస్ పాత్ర మరో స్థాయికి వెళ్లనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో ప్రభాస్ పూర్తి వైల్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ రెండు షేడ్స్‌లో ప్రభాస్ నటన సినిమాకు హైలెట్ కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ఏమైంది? కండాల వీరుడు కొత్త లుక్‌పై అభిమానుల్లో ఆందోళన..
Salman Khan: సల్మాన్ ఖాన్‌కు ఏమైంది? కండాల వీరుడు కొత్త లుక్‌పై అభిమానుల్లో ఆందోళన..

మరోవైపు షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. నెక్స్ట్ షెడ్యూల్ పూర్తిగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ షెడ్యూల్ కోసం ప్రభాస్ ఎనిమిది రోజుల కాల్‌షీట్లు ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన రెండు రోజుల్లో ప్యాచ్‌వర్క్‌తో పాటు సపోర్టింగ్ ఆర్టిస్టుల సన్నివేశాలను షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ షెడ్యూల్‌ను పది రోజుల్లో పూర్తి చేయాలని మూవీ యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!
ప్రతి రోజూ అలా ప్రార్థించేదాన్ని.. సీతమ్మ పాత్ర కోసం సాయి పల్లవి చేసిన పని ఇదే!

ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నటులు వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ఈ సినిమాను పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ యాక్షన్, ఎమోషన్, సైకాలజికల్ థ్రిల్లర్ ను తొమ్మిది భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ పని చేస్తున్నారు. ఇలా ప్రతి కొత్త అప్‌డేట్‌తో 'స్పిరిట్'పై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X