Peddi Day 25 Collections: పెద్దిపై మా ఇంటి బంగారం ఎఫెక్ట్ ? రామ్ చరణ్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Peddi Box Office Collections:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది సినిమా తొలి వారంలో సంచలన వసూళ్లు నమోదు చేసినా, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను కొనసాగించలేకపోతోంది. నాలుగో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా సినిమా వసూళ్లలో అంతా పెద్దగా ఊపు కనిపించడం లేదు. శనివారం స్వల్ప పెరుగుదల కనిపించినప్పటికీ, మొత్తం ట్రెండ్ మాత్రం ఆశించిన విధంగా లేవు. ఈ నేపథ్యంలో 25 రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది?నాలుగో వారం వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే..
24వ రోజు ఎంత వసూలు చేసింది?
ట్రేడ్ అంచనాల ప్రకారం.. 24వ రోజు 'పెద్ది'ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం 80 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. నాలుగో శుక్రవారం సాధించిన 93 లక్షల రూపాయల నెట్తో పోలిస్తే ఇది దాదాపు 14 శాతం తగ్గుదల. సాధారణంగా వీకెండ్‌లో కలెక్షన్లు పెరగాల్సి ఉండగా, ఈసారి ఆ ఊపు కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను నిరాశకు గురి చేసింది. ఇక 24 రోజుల్లో 'పెద్ది' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 239.10 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించగా, గ్రాస్ కలెక్షన్లు 282.13 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్లలో 52.90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 335.03 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది.

సినిమా తొలి వారం అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది. మొదటి ఎనిమిది రోజుల్లోనే 193.55 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే రెండో వారంలో కలెక్షన్లు 34.45 కోట్ల రూపాయలకు పడిపోయాయి. మూడో వారంలో మరింత తగ్గి 9.37 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. నాలుగో వారంలోకి వచ్చే సరికి రోజువారీ కలెక్షన్లు లక్షల్లోకి పడిపోవడం గమనార్హం. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి ఏకంగా రూ.212.48 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం.
25 రోజు అంచనా కలెక్షన్లు
ఇక 25వ రోజు (నాలుగో ఆదివారం) పెద్ది సినిమా దేశవ్యాప్తంగా 479 షోలలో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా మధ్యాహ్నం వరకు 54 లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. వీకెండ్ కావడంతో సాయంత్రం,రాత్రి షోలకు ప్రేక్షకుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే 24వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీర్ లో మరో 50 లక్షలు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ. 340 కోట్ల మార్క్ కు మరింత చేరువ కానున్నదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కలెక్షన్ల వేగం తగ్గినప్పటికీ, 2026లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాగా 'పెద్ది' నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 335 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేయడం చిన్న విషయం కాదు. సుమారు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన పెద్ది ఇప్పటివరకు సినిమా తన బడ్జెట్‌లో 68.31 శాతం మాత్రమే రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అంటే ఇంకా భారీ మొత్తంలో రికవరీ జరగాల్సి ఉంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి నిర్మాతలకు 100 కోట్ల రూపాయలకు పైగా లోటు ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' మంచి మౌత్ టాక్‌తో తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కారణంగా పలుచోట్ల 'పెద్ది' స్క్రీన్లు తగ్గడం, ప్రేక్షకుల దృష్టి కొత్త సినిమా వైపు మళ్లడం కూడా రామ్ చరణ్ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెద్ది సినిమా నాలుగో వారంలో కలెక్షన్లు మరింత మందగించడంతో, థియేట్రికల్ రన్ ముగిసే నాటికి సినిమా తుది బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications




