The Odyssey Day 4 Collections: 3 రోజుల్లో 2500 కోట్లతో ది ఒడిస్సీ సంచలనం.. నాలుగో రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా మూవీ ది ఒడిస్సీ. జూలై 17న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్రీకుల ఇతిహాసాల ఆధారంగా నోలన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ది ఒడిస్సీలో మాట్ డామన్, అన్నె హత్‌వే, టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నోలన్ క్రేజ్‌కు తగినట్లుగానే ఫస్ట్ వీకెండ్‌లో ది ఒడిస్సీ దుమ్మురేపింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ఎన్ని వేల కోట్లు రాబట్టింది? భారత్‌లో కలెక్షన్స్ ఎంత? నాలుగో రోజు ది ఒడిస్సీ ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
ది ఒడిస్సీ బడ్జెట్
ది ఒడిస్సీ మూవీని 250 మిలియన్ డాలర్లు (2400 కోట్ల రూపాయలు) భారీ బడ్జెత్‌తో తెరకెక్కించారు. ప్రమోషనల్ కార్యక్రమాలు, మార్కెటింగ్ నిమిత్తం మరో 125 మిలియన్ డాలర్లు (1200 కోట్ల రూపాయలు) ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 625 మిలియన్ డాలర్లు (6017 కోట్ల రూపాయలు) వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్దేశించారు.

ది ఒడిస్సీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ది ఒడిస్సీ మూవీకి ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా 264.1 మిలియన్ డాలర్లు (2545 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఇందులో ఒక్క నార్త్ అమెరికాలోనే 125.4 మిలియన్ డాలర్లు (1208 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. అంతర్జాతీయంగా 73 దేశాలలో కలిపి 139.6 మిలియన్ డాలర్లు (1345 కోట్ల రూపాయలు) రాబట్టి మరోసారి క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్ చూపించింది. తద్వారా ఈ సినిమా కోసం పెట్టిన బడ్జెట్‌ను వెనక్కి తెచ్చింది.
ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 29.6 మిలియన్ టికెట్లు సేల్ అవ్వగా.. విదేశాల్లో 51.8 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 41 ఐమ్యాక్స్ స్క్రీన్లను ది ఒడిస్సీకి కేటాయించగా.. వీటి నుంచి 6.3 మిలియన్ డాలర్లు (60 కోట్ల రూపాయలు) వసూలైంది. అంతేకాదు.. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రం ఓపెన్‌హైమర్ తొలి వారాంతంలో వసూలు చేసిన కలెక్షన్స్‌ను ది ఒడిస్సీ దాటేసింది. ఓపెన్ హైమర్ ఫస్ట్ వీకెండ్‌లో వరల్డ్ వైడ్‌గా 174 మిలియన్ డాలర్లు (1677 కోట్ల రూపాయలు) రాబట్టగా... ది ఒడిస్సీ ఏకంగా 264 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం.
ఇండియాలో ది ఒడిస్సీ మూడు రోజుల కలెక్షన్స్
క్రిస్టోఫర్ నోలన్ మూవీకి ఇండియాలో తొలిరోజున 17.40 కోట్ల రూపాయలు, రెండో రోజున 22 కోట్ల రూపాయలు, మూడో రోజున 21.90 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 61.30 కోట్ల రూపాయల నెట్.. 73.19 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మూడు రోజుల వరకు మహారాష్ట్రలో 14.89 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 12.08 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 10.26 కోట్ల రూపాయలు, తెలంగాణలో 7.60 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.13 కోట్ల రూపాయలు, కేరళలో 4.43 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 3.32 కోట్ల రూపాయలు చొప్పున కలెక్ట్ చేసింది.
ఇండియాలో నాలుగో రోజు వసూళ్ల అంచనా
భారతీయ సూపర్‌స్టార్సే ఫస్ట్ వీకెండ్‌లో 50 కోట్ల రూపాయల మార్క్ దాటడానికి కష్టపడుతున్నారు. అలాంటిది ఒక ఇంగ్లీష్ సినిమా అయ్యుండి ది ఒడిస్సీ మూడు రోజుల్లోనే 70 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా క్రిస్టోఫర్ నోలన్ క్రేజ్, ది ఒడిస్సీలోని కథ, కథనం, నటీనటుల నటనే ప్రధాన కారణం. తొలి వారాంతంలో దుమ్మురేపిన ది ఒడిస్సీకి సోమవారం నుంచి టెస్ట్ ఎదురవ్వనుంది. వర్కింగ్ డేస్‌లోనూ పాస్ అయితే మాత్రం నోలన్ మూవీకి తిరుగులేనట్లే..
సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ది ఒడిస్సీకి ఇండియాలో 4772 షోలు ప్రదర్శితమై 34.9 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇంగ్లీష్ వెర్షన్‌లోనే సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 4వ రోజున ఇప్పటి వరకు ఇండియాలో ది ఒడిస్సీకి 3 కోట్ల రూపాయల నెట్ వసూలైనట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ట్రెండ్స్‌ను బట్టి ది ఒడిస్సీ ఇండియాలో నాలుగో రోజున 7 కోట్ల రూపాయల రేంజ్‌లో వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో నాలుగు రోజుల్లో ఈ సినిమా 80 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టనుంది.
క్రిస్టోఫర్ నోలన్ మూవీ సోమవారం వరల్డ్ వైడ్‌గా 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (337 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో నాలుగు రోజుల్లోనే ది ఒడిస్సీ 300 మిలియన్ డాలర్ల మార్క్ (2892 కోట్ల రూపాయలు) చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి తొలి వారం ముగిసేనాటికి ఈ హాలీవుడ్ విజువల్ వండర్ ఏ రేంజ్‌లో రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications





