twitter

    ఆహుతి ప్రసాద్ బయోగ్రఫీ

    ఆహుతి ప్రసాద్ తెలుగు సినీ నటుడు. క్యారెక్టర్ నటునిగా, హాస్య నటునిగా గుర్తింపు పొంది 300 పైగా సినిమాల్లో నటించారు. 1983-84ల్లో యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాకా విక్రమ్ తో నటునిగా పరిచయం అయ్యాడు. కొద్ది సినిమాల్లో, ఒక సీరియల్లో నటించాకా ఆహుతి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది, సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో గుర్తింపు లభించి అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీసు పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. పోలీసు భార్య పునర్నిర్మాణం చేసి కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. తొలి సినిమా విజయవంతం అయినా, మిగతా సినిమాల పరాజయం పాలై అప్పుల పాలు చేశాయి. తెలుగులోనూ అవకాశాలు రాకపోడంతో దాదాపు 4 సంవత్సరాల పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పాత్రతో తిరిగి సినిమా అవకాశాలు పెరిగాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాలో నటనకు గాను  సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. చందమామ సినిమాలో పోషించిన రామలింగేశ్వరరావు పాత్ర హాస్యం, విభిన్నమైన సంభాషణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చందమామలో నటనకు గాను సంవత్సరానికి ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గుమ్మడి విభాగంలో నంది అవార్డు పొందారు. ఆ సినిమా తర్వాత కెరీర్ మళ్ళీ మలుపు తిరిగి పలు హాస్య పాత్రలు చేసే అవకాశం వచ్చింది. నిర్మాణ రంగంలో బిల్డర్ గా వ్యాపారం కూడా చేశాడు. 2015 జనవరి 4న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X