జెమినీ గణేషన్
Born on 17 Oct 1920 (Age 103)
జెమినీ గణేషన్ బయోగ్రఫీ
జెమినీ గణేషన్ ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి సావిత్రి భర్త. ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్ గా వ్యవహరిస్తారు. ఇతను సైన్సు గ్రాడ్యుయేట్. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య అలిమేలు. రెండో భార్య నటీమణి పుష్పవల్లి ప్రముఖ నటి రేఖ తల్లి. మూడో భార్య ప్రముఖ నటి సావిత్రి. తన 79వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు. ఇతడు తెలుగులొ ఎక్కువ సినిమాలు చేయనప్పటికి మహానటి సావిత్రిని వివాహంచేసుకున్నందు వలన తెలుగులొ ప్రాచుర్యంలొకి వచ్చాడు.