CelebsbredcrumbNanibredcrumbUnknown Facts

  Unknown Facts

  • 1
   నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు.
  • 2
   చిరంజీవి, ర‌వితేజ త‌ర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న న‌టుడు నాని.
  • 3
   శీనువైట్లతో ఢీ.. బాపు రాధాగోపాలం సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసారు
  • 4
   ఓ సినిమా ఎడిట్ సూట్‌లో ఇంద్ర‌గంటి ఏదో ప‌ని మీద వ‌చ్చి నానిని చూడటం.. కుర్రాడెవ‌రో బాగున్నాడే అని త‌న సినిమాలో హీరోగా అవ‌కాశం ఇవ్వ‌డంతో నాని ద‌శ మారిపోయింది.
  • 5
   చిరంజీవి త‌ర్వాత ఏ అండదండ‌లు లేకుండా ఇంత‌గా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది ర‌వితేజ త‌ర్వాత నానినే.
  • 6
   అష్టాచ‌మ్మా త‌ర్వాత కూడా నానిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రైడ్.. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు న‌టుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి కానీ విజ‌యం కాదు. కానీ 2011 ఈ హీరో కెరీర్ ను మార్చేసింది. ఆ ఏడాది అలా మొద‌లైంది.. పిల్ల జమీందార్ విజ‌యాల‌తో నాని క్రేజీ హీరో అయిపోయాడు.
  • 7
   ఈగ‌తో నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొద‌లైంది. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. పైసా.. ఆహాక‌ళ్యాణం.. జెండా పై క‌పిరాజు ఇలా వ‌ర‌స సినిమాల‌యితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదు
  • 8
   ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం. 2015 మార్చ్ 21న విడుద‌లైంది ఈ చిత్రం. ఆ త‌ర్వాత భ‌లేభ‌లే మగాడివోయ్ సినిమాతో నాని కాస్తా న్యాచుర‌ల్ స్టార్ అయ్యాడు. ఈ ప్ర‌యాణంలో ఎటో వెళ్లిపోయింది మ‌న‌సుకు నంది.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని.
  • 9
   2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ.. జెంటిల్ మ‌న్.. మ‌జ్ను.. నేనులోక‌ల్.. నిన్నుకోరి.. ఎంసిఏ సినిమాల‌తో వ‌ర‌సగా ఎనిమిది విజ‌యాలు
  • 10
   కంటెంట్ ఎలా ఉన్నా.. కథ ఏదైనా.. యాక్టింగ్‌లో మాత్రం అదరగొడుతుంటాడు నాని. నేచురల్ స్టార్ అనే బిరుదుకు సార్థకం చేస్తూ ఎన్నో సినిమాల్లో సహజసిద్ధమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
  • 11

   ప్రతి సినిమాను వన్ మ్యాన్ షోగా మారుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం తనకు తానే పోటీ అనేటట్లుగా నటిస్తున్నాడు.
  • 12
   వరుస హిట్లతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే నేచురల్ స్టార్ నాని.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడు.
  • 13
   ఎన్నో వివాదాల నడుమ ప్రసారం అయిన రెండో సీజన్‌ను అద్భుతంగా నడిపించాడు.
  • 14
   అయినప్పటికీ నానిపై ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. దీంతో మరోసారి ఈ తరహా షోలు చేయకూడదని ఈ స్టార్ హీరో నిర్ణయం తీసుకున్నాడు.
  • 15
   హీరోగా సత్తా చాటుతోన్న నాని.. నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు 'డీ ఫర్ దోపిడీ', 'ఆ!', 'హిట్' అనే సినిమాలు నిర్మించాడు
  • 16

   ఇక, హీరోగా ప్రస్తుతం 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను పూర్తి చేసిన నాని.. ఇప్పుడు 'దసరా' అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా మారిపోయాడు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X