నిత్యామీనన్
Born on 08 Apr 1990 (Age 33) బెంగుళూరు
నిత్యామీనన్ బయోగ్రఫీ
నిత్యా మేనన్ ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది. అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.
అలా మొదలైంది తర్వాత సెగ, 180 వంటి చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద వూహించినంతగా ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ తర్వాత వచ్చిన ఇష్క్ మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. మళ్లీ నితిన్‌తో జతకట్టిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ జంట విజయవంతమైన హిట్ పెయిర్ గా నిలిచింది. జబర్దస్త్, ఒక్కడినే చిత్రాల్లో నటనకుగాను మంచి మార్కులే సొంతం చేసుకుంది నిత్య. గీత గోవిందం, ప్రాణ, జనతా గ్యారేజ్ తదితర చిత్రాలలో చేసింది.
సంబంధిత వార్తలు