X
హోమ్ » సెలెబ్స్ » నిత్యామీనన్ » తెలియని విషయాలు
నిత్యామీనన్
Actress

నిత్యామీనన్ - తెలియని విషయాలు

  • 1
    మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆఫ్ బెంగళూరులో హైయ్యర్ ఎడ్యూకేషన్ పూర్తి చేసుకుంది. ఇక ఈమె నటిగా 8 యేళ్ల వయసులోనే ఒక ఇంగ్లీష్ చిత్రం The Monkey Who Knew Too Much (1998)లో టబు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది. అటు 2006 16వ యేటనే కన్నడ సినిమాల ‘7 O Clock’ మూవీలో సహాయ పాత్రలో నటించింది.
  • 2
    1988 ఏప్రిల్ 8న జన్మించిన నిత్యా మీనన్.. 2008లో మలయాళ సినిమా ‘ఆకాశ గోపురం’ సినిమాలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె వెనుదిరిగి చూసుకోలేదు. 2011లో నాని హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అలా మొదలైంది’ మూవీలో కథానాయికగా తెలుగులో అడుగుపెట్టింది.
  • 3
    అదే యేడాది సిద్ధార్ధ్ హీరోగా నటించిన ‘నూట్రెన్‌బంధు’ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో 180 టైటిల్‌తో విడుదలైంది. మొత్తంగా 14 యేళ్ల ఇయర్‌లో 50 కి పైగా చిత్రాల్లో నటించింది.
  • 4
    2019లో నిత్యా మీనన్ .. హిందీలో ‘మిషన్ మంగళ్’ సినిమాతో పరిచయమైంది. ఈ సినిమా బాలీవుడ్‌లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. అటు హిందీలో అభిషేక్ బచ్చన్‌తో ‘బ్రీత్’ ఇన్ టూ షాడోస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.
  • 5
    ఇక నిత్యా మీనన్ విషయానికొస్తే.. సినిమాలో తన పాత్ర నచ్చితే ఎలాంటి ఈగోలకు పోకుండా యాక్ట్ చేసే అతికొద్ది మంది నటీమణుల్లో ఈమె ఒకరు. తాజాగా పవన్ కళ్యాణ్ సరసన ‘భీమ్లా నాయక్’ సినిమాలో ఆయన భార్య పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది.
  • 6
    తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం. టాలెంటెడ్ నటిగా ప్రూవ్ చేసుకున్న నిత్యమీనన్ . ఇన్నేళ్ల కెరీర్‌లో ఉత్తమ నటిగా నంది అవార్డులతో పాటు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకుంది.
  • 7
    జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ సరసన నటించిన నిత్యామీనన్. ఈ సినిమాలో నిత్యామీనన్ పాత్ర చిన్నదే క్యారెక్టర్ మంచిగా ఉండటంతో ఈ సినిమాలో యాక్ట్ చేసింది.
  • 8
    బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో సావిత్రి పాత్రలో నటించిన నిత్యా మీనన్.. ఈ సినిమా కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ కాలేదు. అంతేకాదు మన భాష నటి కాకపోయినా.. ఇక్కడి భాషను నేర్చుకొని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
  • 9
    సావిత్రి పాత్రలో కాసేపు మెరిసిన నిత్యామీనన్.. కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా తన టాలెంట్ ఏంటో చూపెట్టింది. కాంచన 2లో ఈమె నటన గురించి ఎంత చెప్పినా.. తక్కువే.
  • 10
    జయలలిత బయోపిక్‌ పై తెరకెక్కుతోన్న ఓ బయోపిక్‌లో అమ్మ జయలలిత పాత్రలో నటిస్తోన్న నిత్యా మీనన్. ఇప్పటికే జయలలితపై రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అటు కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ మూవీ వచ్చింది. అయినా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పినా.. ఇప్పటికీ ఈ బయోపిక్ పై అప్‌డేట్ లేదు.
  • 11
    జయలలిత జీవితంపై ‘ది ఐరన్ లేడీ’ అనే బయోపిక్‌లో నిత్యామీనన్ లుక్ చూస్తే.. అసలు సిసలు జయలలితను చూస్తున్నంటే ఉంది. మరి ఈ సినిమా ఎపుడు విడుదలవుతుందో చూడాలి.
  • 12
    విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతా గోవిందం’లో అతిథి పాత్రలో కనిపించిన నిత్యా మీనన్.. మొత్తంగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయిన నటించడం అనేది నిత్యామీనన్‌నే చూసి నేర్చుకోవాలి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+