twitter
    CelebsbredcrumbRami ReddybredcrumbBiography

    రామి రెడ్డి బయోగ్రఫీ

    గంగసాని రామిరెడ్డి భారతదేశపు ప్రముఖ నటుడు. ఇతడు ప్రతినాయక పాత్రలకు ప్రసిద్ధి. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు. తెలుగులో అంకుశం చిత్రం ద్వారా నట జీవితాన్ని ప్రారంభించిన రామిరెడ్డి, అ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మళయాల మరియు భోజ్పురి భాషలలో ప్రతినాయకుడిగా దాదాపు 250 చిత్రాలలో నటించాడు.


    రామిరెడ్డి చిత్తూరు జిల్లా, వాయల్పాడులో జన్మించాడు. నటుడు కాక మునుపు పత్రికా విలేఖరిగా పనిచేశాడు. కొంతకాలం మూత్రపిండాల సంబంధ వ్యాధి కారణంగా మృత్యువు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు. కానీ అదే వ్యాధితో హైదరాబాదులోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 14, 2011 న మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.

    తెలుగు సినిమాల్లో హీరోలకు ఎంత పాపులారిటీ ఉంటుందో విలన్లకు కూడా అంత పాపులారిటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఒక సినిమా విజయం సాధించింది అంటే ఆ సినిమాకు హీరో కి వచ్చినట్టే.. స్టార్ డమ్  అటు విలన్ కి కూడా వస్తుంది. దీంతో హీరో స్టార్ హీరో అయినట్లే..విలన్లు  కూడా స్టార్ విలన్ గా మారి పోతారు. ఇలా హీరోకు హీరోలకు మించిన క్రేజ్ సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు  రామిరెడ్డి. 

    నేటి తరం ప్రేక్షకులకు రామిరెడ్డి తెలియకపోవచ్చు కానీ... మూడు దశాబ్దాలకు ముందు రామిరెడ్డి అనే పేరు తెలియని వారు ఉండరు. ఏ సినిమాలో చూసినా రామిరెడ్డి విలన్ గా నటించాడు.

     అయితే జర్నలిస్ట్ గా ఉండే రామిరెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణ అంకుశం అనే సినిమాతో విలన్ గా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు. భారీ కాయంతో ఆరడుగులు ఉండే రామిరెడ్డి మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మొత్తం ఒక్కసారిగా ఆకర్షించాడు. 

      ఇక ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ చూపు మొత్తం రామిరెడ్డి వైపు మళ్ళింది. ఒక్కసారిగా రామిరెడ్డికి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలందరూ రామిరెడ్డి తో సినిమా చేయడానికి క్యూ కట్టారు. ఇక స్టార్ హీరోలందరి సినిమాల్లో  రామిరెడ్డి విలన్ గా మారిపోయాడు. స్టార్ విలన్ గా కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో హవా నడిపించాడు.

     ఇక రామిరెడ్డి విలన్ గా నటించిన అమ్మోరు సినిమా ఆయనకు మరింత పేరును తెచ్చిపెట్టింది. అమ్మోరు సినిమా లో  క్షుద్ర మాంత్రికుడు గా నటిస్తాడు రామిరెడ్డి. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్లను రామిరెడ్డి పెట్టే చిత్రహింసలు చూసి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సైతం బాధపడేలా ఉంటుంది. ఇక ఆ తర్వాత హిట్లర్, మృగరాజు వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. 

     రామిరెడ్డి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన ఇప్పటి వరకు నటించిన విలన్ పాత్రలు అన్నీ  ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా విజయశాంతి హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ఒసేయ్ రాములమ్మ  సినిమాలో  దొర పాత్రలో నటించి ఎన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు సైతం అందుకున్నారు రామిరెడ్డి. ఒసేయ్ రాములమ్మ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది అని  చెప్పాలి. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X