శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై యాంకర్ గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు.
డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో ప్రముఖ నిర్మాత కె.యస్. రామారావు దగ్గర ఎడిట్ సూట్ లో పనిచేశాడు. అప్పుడే సినిమాలని నిశితంగా పరిశీలించడం నేర్చుకున్నాడు. శివాజీ నటించిన సినిమాల్లో మొదట విడుదలైంది. చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ అనే సినిమా. కానీ తొలి అవకాశం ఇచ్చింది మాత్రం వై. వి. ఎస్. చౌదరి. ఆ సినిమా సీతారాముల కల్యాణం చూతము రారండి అందులో శివాజీది హీరో స్నేహితుడి పాత్ర.
ఆ తర్వాత చాలా సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు ఇంద్ర, ఖుషి, ప్రియమైన నీకు, ప్రేమంటే ఇదేరా, తులసి వంటి మొదలగు చిత్రాలలో నటించారు.
శివాజి హీరోగా మిస్సమ్మ, అదిరిందయ్య చంద్రం, టాట బిర్ల మద్యలో లైల వంటి మొదలగు చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. మొత్తం 50 సినిమాలకు పైగా నటించారు.
2018 మార్చి 22 న చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఒక జాతీయ రాజకీయ పార్టీ దక్షిణ భారత దేశంలో విస్తరించేందుకు గాను, "ఆపరేషన్ ద్రవిడ" అనే కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో "ఆపరేషన్ గరుడ"ను నిర్వహిస్తోందనీ చెప్పాడు
2019 జూలై 3న ‘గరుడ పురాణం’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే రాజకీయాలపై జోష్యం చెప్పిన సినీ హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ని పట్టుకున్నారు.