శ్రీ రెడ్డి
Born on 12 Jun 1992 (Age 31)
శ్రీ రెడ్డి బయోగ్రఫీ
శ్రీ రెడ్డి భారతీయ సినీ నటి ఆమె అసలు పేరు విమల మల్లిడి. 1992 జూన్ 12న కృష్ణా జిల్లా విజయవాడ లోని కంకిపాడుకు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో పుష్పవతి, వెంకటరెడ్డి దంపతులకు జన్మించింది.
శ్రీ రెడ్డి 2008లో మంచి ఉద్యోగం చూసుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని విజయవాడ నుంచి భాగ్యనగరానికి చేరింది. యాంకర్ గా కెరీక్ ఆరంభించింది. సాక్షి టీవీలో యాంకర్ గా పనిచేసింది. గీతామాధురి భర్త నందు హీరోగా నటించిన "నేను నాన్న అబద్ధం" చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయింది. 2011లో విడుదలైన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మరో సినిమాలో ఛాన్స్ కోసం శ్రీరెడ్డి రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. 2013లో అరవింద్ 2 చిత్రానికి ఎంపికైంది. ఆ సినిమాలో శ్రీరెడ్డికి మంచి పేరే వచ్చింది. జిందగీ అనే మరొ సినిమాలో హీరో యిన్ గా ఛాన్స్ వచ్చింది.