X
తమన్ యస్
Music Director/Singer/Lyricst

తమన్ యస్ బయోగ్రఫీ

తమన్ పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. తమన్ గా సుపరిచితుడు. 1983 నవంబరు 16 ఆంధ్ర ప్రదేశ్ లో జన్నించాడు. ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో పనిచేసిన సినీ సంగీత దర్శకుడు తమన్. సంగీత దర్శకుడిగా ఈయన తొలిచిత్రం రవి తేజ నటించిన బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా కిక్, అలాగే ఇతను బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో నటించాడు. ఇతను దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా మంచి పేరుతెచ్చుకున్నాడు.
ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్, అతను స్వరకర్త కె.చక్రవర్తి కింద ఏడువందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్, తన తల్లి ఘంటసాల సావిత్రి నేపథ్య గాయని మరియు తన అత్త పి.వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు.
భాగమతి (2018), రేసుగుర్రం (2014), బిజినెస్ మేన్ (2012) తదితర చిత్రాలకి సంగీతమందించారు. సంగీత దర్శకుడే కాకుండ నటుడు, స్వరకర్త, రికార్డు నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు. అలాగే రిథమ్ ప్యాడ్స్ మరియు కీబోర్డ్ వాయిద్యాలు కూడ వాయిస్తాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+