CelebsbredcrumbVenkateshbredcrumbBiography

  వెంకటేష్ బయోగ్రఫీ

  దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా విక్టరీ వెంకటేష్  అని పిలుసుకుంటారు. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు కుమారుడు. వెంకటేష్ 13 dec 1960 ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు.

  శతచిత్రాల నిర్మాత మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు వారసునిగా తెలుగు సినిమాకు పరిచయమయి, ఆనతికాలం లోనే 'విక్టరీ' ని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు. వెంకి స్కూల్ చదువు మద్రాస్ లోని ఎగ్మోర్ లో ఉన్న డాన్ బాస్కో స్కూల్ లో సాగింది. మద్రాస్ లోనే లయోలా కాలేజీ నుండి బి.కామ్ లో పట్టబద్రులయ్యారు. తరవాత అమెరికాలోని మోన్టేరీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్ నేషనల్ స్టడీస్ నుండి యం.బి.ఏ పూర్తి చేసారు. అప్పుడు రామానాయుడుగారు రాఘవేంద్రరావు, హీరో కృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేసారు కానీ ఆఖరి నిమిషంలో కృష్ణ డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమా చేయలేను అన్నారు. రాఘవేంద్రరావు డేట్ లు వదులు కోవటం ఇష్టంలేని రామానాయుడి గారు వెంకటేష్ తో సినిమా మొదలు పెట్టారు. అదే 1986లో వచ్చిన కలియుగపాండవులు. ఆ సినిమా ఘనవిజయంతో వెంకటేష్ పేరు ఆంద్రదేశమంతటా మారు మ్రోగటమే కాకుండా తోలిచిత్రంతోనే నంది అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించారు. ఇక అక్కడినుండి 25 సంవత్సరాల కాలంలో 63 చిత్రాలలోనటించారు. నటించిన మొత్తం చిత్రాలలో ఎక్కువ శాతం విజయాలు ఉన్న తెలుగు హీరోగా వెంకి అభినందనీయుడు. అందుకనే 'విక్టరీ' అనేది అయన ఇంటిపేరు అయ్యింది. కెరీర్ తోలినాళ్ళలో యువతను ఆకర్షించిన వెంకి బొబ్బిలిరాజ తో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రేమించుకుందాం..రా..!, పెళ్ళిచేసుకుందాం, కలిసుందాం..రా..! వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం గెలుచుకుని తెలుగు సినిమా మూడో తరం టాప్ నలుగురు హీరోలలో ఒకరిగా నిలిచారు.

  వెంకటేష్ తెలుగు లోనే కాకుండా 'ఆనారి', 'తక్ దీర్ వాలా' వంటి చిత్రాలతో హిందీలో కూడా తన ఉనికిని చాటారు. సెంటిమెంట్, యాక్షన్ లను వైవిద్యంగా ప్రదర్శించటం లో వెంకటేష్ ది ఒక ప్రతేక శైలి. తన సమకాలిన నటులలో హాస్యాన్ని సమర్ధవంతంగా పండించగలడు. చాలా సినిమాలలో ఆయన ఫ్యామిలీ హీరో పాత్రలను ధరించారు. ఈయన ఇటీవలి చిత్రాలు లక్ష్మి, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే మరియు తులసి చిత్రాలు వరుసగా విజయవంతమై వెంకటేష్ కు హ్యట్రిక్కును సాధించాయి. హాస్య ప్రధాన పాత్రలలో పోషిస్తూనే ఈయన ఘర్షణ, లక్ష్మి వంటి యాక్షన్ చిత్రాలను కూడా చేశారు. ఈయన నటించిన కుటుంబ ప్రధాన చిత్రాలు ఈయనకు అనేక మంది మహిళా అభిమానులను సంపాదించాయి. 2007లో ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే చిత్రానికి గానూ ఈయనకు స్వర్ణ నంది అవార్డు లభించింది. మసాలా మసాలా  దృశ్యం  గోపాల గోపాల వంటి కామెడి చిత్రాలుతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.  గురు చిత్రంతో తెలుగు లొ బాక్సర్ ట్రైనర్ గా తన నటనలోని కొత్తగా చూపారు. ఈ సినిమాకి గాను స్వర్ణ నంది లభించింది. 2019లో సంక్రాంతికి విడుదలైన మల్టిస్టారర్ సినిమా ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్), వరుణ్ తేజ్ తో కలసి నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని వరించింది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X