CelebsbredcrumbVenkatesh
  వెంకటేష్

  వెంకటేష్

  Actor
  Born : 13 Dec 1960
  Birth Place : కారంచేడు, ఆంద్రప్రదేశ్
  దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా విక్టరీ వెంకటేష్  అని పిలుసుకుంటారు. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు కుమారుడు. వెంకటేష్ 13 dec 1960 ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు. శతచిత్రాల నిర్మాత మూవీ మొఘల్ డా.... ReadMore
  Famous For
  దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా విక్టరీ వెంకటేష్  అని పిలుసుకుంటారు. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు కుమారుడు. వెంకటేష్ 13 dec 1960 ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు.

  శతచిత్రాల నిర్మాత మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు వారసునిగా తెలుగు సినిమాకు పరిచయమయి, ఆనతికాలం లోనే 'విక్టరీ' ని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ప్రకాశంజిల్లా లోని కారంచేడులో జన్మించారు. వెంకి స్కూల్ చదువు మద్రాస్ లోని ఎగ్మోర్ లో ఉన్న డాన్ బాస్కో స్కూల్ లో సాగింది. మద్రాస్ లోనే లయోలా కాలేజీ నుండి బి.కామ్ లో పట్టబద్రులయ్యారు. తరవాత అమెరికాలోని మోన్టేరీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంటర్ నేషనల్ స్టడీస్ నుండి యం.బి.ఏ పూర్తి చేసారు. అప్పుడు...
  Read More
  • నారప్ప మూవీ థీమ్ లిరికల్ వీడియో
  • నారప్ప మూవీ ట్రైలర్
  • చలాకి చిన్నమ్మి లిరికల్ వీడియో- నారప్ప
  • నారప్ప టీజర్
  • 1
   ఈ రోజుల్లో నిర్మాతల కుమారులు కూడా హీరోలు అవుతున్నారు. అయితే వారంతా హీరోలు అవ్వడం అనేది పెద్ద పనేం కాదు. వారు సక్సెస్ సాధించడమే వారికి పెద్దపని. నిర్మాతలలో చాలా మందిది నట కుటుంబం అనేది ఉండదు. వారి కుటుంబంలో నటన ఉండదు. అయితే ఇలాంటి అపొహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ విక్టరీ వెంకటేష్ ఓన్ టాలెంట్ తో ఫ్యామిలీ, యాక్షన్, క్లాసిక్, ప్రేమ, కామెడీతో పాటు నవ రసాల తన నటనతో ఎందరినో అభిమానులను సంపాదించుకున్నాడు.
  • 2
   వెండి తెరపై వెంకీ కనిపిస్తే చాలు ఆ సినిమా సక్సెస్ అనే పేరు సంపాదించుకున్న అతను 1960 డిసెంబర్ 13వ తేదీన గుంటూరు జిల్లా కారంచేడులో జన్మించాడు.
  • 3
   1990వ దశకంలో వచ్చిన సినిమాలన్నీ విజయ పరంపర కొనసాగడంతో విక్టరీ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. చాలా మంది దగ్గుబాటి వెంకటేష్ అంటే ఎవరో తెలియదు అంటారు. అయితే విక్టరీ వెంకటేష్ అంటే మాత్రం అందరూ టక్కున గుర్తు పట్టేస్తారు.
  • 4
   విక్టరీ వెంకటేష్ చిన్ననాటి నుండే క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఇండియా మ్యాచులు స్వదేశంలో జరిగినా, విదేశాల్లో జరిగినా అస్సలు మిస్సవ్వడు. ఏకంగా క్రికెట్ స్టేడియంకు వెళ్లి మరీ మ్యాచులను తిలకిస్తాడు. అంతే కాదండోయ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లోనూ చాలా ఉత్సాహంగా పాల్గొంటాడు. అంతే కాదండోయ్ క్రికెట్ సంబంధించి అందరికీ ‘వసంతం‘ పంచాడు.
  • 5
   వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అయినప్పటికీ ఆయన రెడ్డి కుటుంబం నుండి వచ్చిన నీరజారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఆయనకే కాదు ఆయన తండ్రి రామానాయుడుకు కుల పట్టింపులు లేవట. మద్రాసులో ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి కుమార్తె నీరజా రెడ్డిని తొలుత రామానాయుడే ఒకే చేశారట. ఆ తర్వాతే వెంకటేష్ కు ఆమె నచ్చడంతో వారి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారట.
  • 6
   సాధారణంగా వారసత్వం అనేది కేవలం తొలి అవకాశాన్ని ఇస్తుంది. కానీ టాలెంట్ ఉంటేనే ఎవరైనా విజయవంతంగా రాణించగలుగుతారు. తన తండ్రి అండతో ‘కలియుగ పాండవులు‘ పేరిట తొలి సినిమా తీసిన విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. క్లాస్, మాస్, కామెడీ, ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలను చేసి అమ్మాయిలలో అద్భుతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఇప్పటికీ వెంకీ మామ పేరిట వరుస సినిమాలు చేస్తూ తన సత్తా ఏంటో చూపుతున్నాడు.
  • 7
   విక్టరీ వెంకటేష్ 33 ఏళ్ల నుండి తన సినీ ప్రస్థానాన్ని సింపుల్ గా, అందరి కంటే విభిన్నంగా కొనసాగిస్తున్నాడు. వెంకటేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తెలుగు బోల్డ్ స్కై తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
  వెంకటేష్ వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X