శోభనం సీన్‌లో లయ ఎందుకు ఏడ్చింది? 25 ఏళ్ల తర్వాత నిజం చెప్పిన జగపతిబాబు!
టాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ గా ప్రత్యేక గుర్తింపు అందుకున్న నటుడు జగపతిబాబు. హీరోగా, విలన్‌గా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో విజయాలు, అపజయాలు చూశారు. ఫ్యామిలీ హీరోగా ఎంటర్టైన్ చేసినా జగపతి బాబు.. సెకండ్ ఇన్నింగ్ లో లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు సినిమాలతో తనదైన ముద్ర వేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటి లయతో తనకున్న అనుబంధం, 'మనోహరం' సినిమా షూటింగ్‌లో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను సరదాగా చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
జగపతిబాబు, లయ కలిసి గతంలో మనోహరం, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో నటించారు. చాలా ఏళ్ల తర్వాత తాజాగా 'వదలా'అనే సినిమాలో కలిసి నటించారు. ఎమోషన్స్, మిస్టరీ, సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీకి అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లయ, హృతికా శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిల్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. ఈ సినిమా జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జగపతిబాబు.. లయతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు.

జగపతి బాబు మాట్లాడుతూ.. లయను చూసిన వెంటనే పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని చెప్పారు. 'మనోహరం సినిమా సమయంలో లయ చాలా చిన్న పిల్ల. అప్పట్లో తన వయసు కూడా చాలా తక్కువ. అందుకే ఆమెను చూసినప్పుడల్లా చిన్న పిల్ల అనే భావనే ఉండేది. నా ఉద్దేశం ప్రకారం అప్పటికంటే ఇప్పుడే ఇంకా క్యూట్‌గా కనిపిస్తోంది’ ఫన్నీ కామెంట్స్ చేశారు.
అదే సమయంలో మనోహరం షూటింగ్‌లో జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన గుర్తు చేశారు. సినిమాలో శోభనం (ఫస్ట్ నైట్) సీన్ షూటింగ్ జరుగుతుండగా, డైరెక్టర్ చెప్పినట్లు తాను బెడ్‌వైపు వెళ్లగానే లయ ఒక్కసారిగా భయపడి బోరున ఏడ్చేసిందని తెలిపారు. ఆమె అప్పట్లో చాలా అమాయకురాలని, ఆ సంఘటన ఇప్పటికీ తనకు గుర్తుందని జగపతిబాబు చెప్పారు. ఆ సంఘటన తర్వాత కూడా తమ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ అలాగే కొనసాగిందని ఆయన వెల్లడించారు.
"ఆమె నాకు ఎప్పుడూ చిన్న పిల్లగానే కనిపిస్తుంది. అందుకే ఆ బాండింగ్ ఎప్పటికీ మారలేదు. ఇప్పుడు మళ్లీ కలిసి నటించినా కొత్తగా అనిపించలేదు. పాత పరిచయమే కొనసాగినట్లు అనిపించింది" అని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఒకసారి కలిసి పనిచేసిన ఆర్టిస్టుల మధ్య మంచి అనుబంధం ఉంటే, మళ్లీ కలిసి నటించడం చాలా సహజంగా అనిపిస్తుందని జగపతిబాబు అభిప్రాయపడ్డారు. కొందరు పెద్ద స్టార్‌లు అయిన తర్వాత మాత్రమే ఆటిట్యూడ్ చూపిస్తారని, అలాంటివి లేకపోతే సంబంధాలు అలాగే కొనసాగుతాయని వ్యాఖ్యానించారు.
అదే ఇంటర్వ్యూలో నటి ఆమని గురించి కూడా జగపతిబాబు ప్రశంసలు కురిపించారు. ఆమె నటించిన పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందని అన్నారు. అసలు పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని జీవించేసిందని కొనియాడారు. స్క్రిప్ట్ ఎంపికలో ఆమని చాలా సెలెక్టివ్‌గా ఉంటుందని, ఈ సినిమాకు ఒప్పించడానికి కూడా కొంత సమయం పట్టిందని వెల్లడించారు. అయితే చివరికి ఆమె అంగీకరించడం సినిమా బృందానికి పెద్ద ప్లస్‌గా మారిందని చెప్పారు.


Click it and Unblock the Notifications




