నా ప్రియుడు సైకో.. సిగరెట్‌తో కాల్చి హింసించాడు.. టాలీవుడ్ హీరోయిన్ కన్నీటి గాథ!
ఆ హీరోయిన్ జీవితం బయటకు అందంగా కనిపించినా.. లోపల మాత్రం ఎన్నో చేదు అనుభవాలు, దారుణాలు. ప్రేమ పేరుతో తాను నరకం అనుభవించానని,ఒకప్పుడు తనను ప్రేమించిన వ్యక్తి సైకోలా ప్రవర్తించేవాడని, సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడని షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన ఆ హీరోయిన్ ఎవరు? ఆమె జీవితంలో అసలు ఏం జరిగింది?
ఆ బాధితురాలు ఎవరో కాదు.. బుల్లితెర నటి, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరోయిన్ నితి టేలర్. ఈ అమ్మడు కేవలం 15 ఏళ్ల వయసులోనే తన కెరీర్ ను ప్రయాణాన్ని ప్రారంభించింది. 2009లో టెలివిజన్‌లో అడుగుపెట్టిన ఆమె 'కైసీ యే యారియాన్'సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పార్థ్ సమథాన్‌తో ఆమె జోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం 'గులామ్','ఇష్క్‌బాజ్','ఝలక్ దిఖ్లా జా 10' వంటి పలు షోలలో నటించింది. తెలుగు ప్రేక్షకులకు ఆమె'మేం వయసుకు వచ్చాం'సినిమాతో పరిచయమైంది.

ఇక నితి టేలర్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె 2019లో సైనిక అధికారి పరిచిత్ బావాతో నిశ్చితార్థం చేసుకుంది. అనంతరం 2020 ఆగస్టు 13న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. గత ఏడాది వీరిద్దరూ విడాకుల తీసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారంపై స్పందించిన నితి.. "ఏ విషయంపై స్పందించకపోవడమే కొన్ని సందర్భాల్లో సమాధానం అవుతుంది. జరగని విషయాలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు" అంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం 'అలయన్స్' అనే రియాలిటీ గేమ్ షోలో ఈ అమ్మడు పాల్గొంటుంది. ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని తొలిసారి వెల్లడించింది. గతంలో తాను ప్రేమించిన వ్యక్తి చేతిలో శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.షోలో తన తొలి కంటెస్టెంట్స్ మినీ మాథుర్, రూహీ దోసానీ, దెల్బర్ ఆర్యలతో నితి టేలర్ మాట్లాడుతూ.. తన గత ప్రేమకథ గురించి వెల్లడించింది.
"నా మాజీ ప్రియుడు చాలా క్రూరమైన వ్యక్తి. అతడు సైకో. ఒకసారి తన పుట్టినరోజు రోజే పూర్తిగా నియంత్రణ కోల్పోయి నాపై దాడి చేశాడు. నన్ను కొట్టడమే కాకుండా, సిగరెట్‌తో నా తొడపై కాల్చాడు" అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఇప్పటికీ తన శరీరంపై ఉన్న ఆ గాయం మచ్చను కూడా కెమెరాకు చూపించింది.
ఆ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని బాధగా మిగిలిపోయిందని నితి తెలిపింది. "అప్పుడు నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. మనుషుల అసలు స్వభావాన్ని గుర్తించేంత పరిణతి నాకు లేదు. ప్రేమలో ఉన్నప్పుడు చాలా విషయాలను పట్టించుకోం. కానీ ఆ రోజు జరిగిన ఘటన తర్వాత ఇక ఒక్క క్షణం కూడా అతనితో ఉండకూడదని నిర్ణయించుకున్నాను.'గుడ్‌బై' చెప్పి ఆ సంబంధానికి శాశ్వతంగా ముగింపు పలికాను" అని వెల్లడించింది. ప్రస్తుతం నితి టేలర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications




