Pregnancy: రెబ్బా మోనికా జాన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్.. కూలీ భామ బేబీ బంప్ ఫోటోలు ట్రెండింగ్
ఇటీవల సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో పంచుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి, ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టిన వార్తలు బయటకు రావాలంటే మీడియాపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. జీవితంలోని మధుర క్షణాలను ఎప్పుడు, ఎలా ప్రకటించాలనేది సెలబ్రిటీలే నిర్ణయిస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నేరుగా అభిమానులతో ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అలా తాజాగా కూలి ఫేమ్ , నటి రెబా మోనికా జాన్ (Reba Monica John) కూడా తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అందమైన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి అభిమానులను సంతోషంలో ముంచెత్తింది.
సౌత్ ఫిల్మీం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రెబా మోనికా జాన్. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రెబా.. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో వరుస అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో 'బిగిల్','ఎఫ్‌ఐఆర్','కూలీ', మలయాళంలో ఫోరెన్సిక్, తెలుగులో 'సామజవరగమన','మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ' సినిమాలో శ్రుతి హాసన్ సోదరి పాత్రలో కనిపించి మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 2022లో వ్యాపారవేత్త జోమోన్ జోసెఫ్ ను వివాహం చేసుకున్న రెబా.. ఇటీవల తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడు రాబోతున్నాడనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. "మేమిద్దరం ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం.." అంటూ ప్రకటించారు.
తాజాగా ప్రెగ్నెన్సీ లాస్ట్ డేస్ లో ఉన్న రెబా మరోసారి తన అభిమానులను సర్ప్రైజ్ చేశారు. భర్త జోమోన్‌తో కలిసి బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా స్టైలిష్‌గా రెడీ అవ్వడం తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. "బేబీ బంప్‌తో డ్రెస్సింగ్ చేయడం కూడా చాలా సరదాగా ఉంటుంది. ఈ అందమైన ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. కృతజ్ఞతతో, మంచి వైబ్స్‌తో, డేట్ నైట్‌ను ఎంజాయ్ చేస్తున్నాం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఆమె స్టైలిష్ అవుట్‌ఫిట్‌కు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు బేబీ బంప్‌తో షేర్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అంతకుముందు ఈ దంపతులు "మా చిన్నారి రాక కోసం వేచి ఉన్నాం.. అద్భుత క్షణాలను ఆస్వాదిస్తున్నాం" అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ సమయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా డ్యాన్స్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. రెబా పోస్ట్‌లపై అభిమానులు,సినీ ప్రముఖులు రెబా దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తంగా రెబా ఫోటోలు మాత్రం ట్రెండింగ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications




