'అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా'.. మనసులో మాట చెప్పిన శ్రీలీల..

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. అందం, అభినయం, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ అమ్మడు సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో కూడా తరచూ హాట్ టాపిక్‌గా మారుతుంటారు. ముఖ్యంగా ఆమె పెళ్లి, రిలేషన్‌షిప్ గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మకు తనకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలి ? అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు శ్రీలీల ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?

Also Read
Nagabandham Day 2 Collections: నాగబంధం కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 2 Collections: నాగబంధం కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఎన్ని కోట్లంటే?

తెలుగులో 'పెళ్లి సందD'సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ తరువాత 'ధమాకా' సినిమాతో భారీ విజయాన్ని అందుకుని ఒక్కసారిగా టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ అతి తక్కువ సమయంలోనే టాప్ లీగ్‌లో చేరింది. బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నితిన్, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి వంటి హీరోలతో కలిసి నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Sreeleela Reveals Her Dream Life Partner
Recommended For You
ఆ స్వార్థంతోనే బిగ్ బాస్‌కి వెళ్లాను.. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లను: మాజీ కంటెస్టెంట్
ఆ స్వార్థంతోనే బిగ్ బాస్‌కి వెళ్లాను.. కానీ ఇప్పుడు మాత్రం వెళ్లను: మాజీ కంటెస్టెంట్

అయితే గత కొంతకాలంగా శ్రీలీల నటించిన సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేక పోతున్నాయి. వరుస పరాజయాలు ఎదురైనా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెను తమ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ గా భావిస్తున్నారు. ఇటీవల తమిళం, బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన శ్రీలీల.. అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమెకు కమర్షియల్ లేకపోయినా.. డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ పరంగా మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయని చెప్పాలి.

You May Also Like
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌‌తో జయకృష్ణ
27 ఏళ్ల తర్వాత అదే డేట్.. మహేష్ బాబు సెంటిమెంట్‌‌తో జయకృష్ణ

ఇదిలా ఉంటే, తాజాగా రిలేషన్‌షిప్ గురించి అడిగిన ప్రశ్నకు శ్రీలీల ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. "నా జీవిత భాగస్వామి చాలా సెన్సిబుల్‌గా ఉండాలి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే సెన్సిటివ్ మనస్తత్వం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి" అని ఆమె చెప్పారు. కేవలం రూపం లేదా గ్లామర్ కంటే వ్యక్తిత్వం, మనస్తత్వం, పరస్పర అవగాహనకు తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.

మూడుసార్లు అదే తప్పు.. త్రిష ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?
మూడుసార్లు అదే తప్పు.. త్రిష ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి."శ్రీలీల హార్ట్ గెలవాలంటే ఈ మూడు క్వాలిటీస్ తప్పనిసరి" అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు "అబ్బాయిలూ... మీలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వెంకీ- అనిల్ రావిపూడి మూవీ ఆ సినిమాకు రీమేకా?.. సీక్రెట్ రివీల్ చేసిన కీర్తి సురేష్!
వెంకీ- అనిల్ రావిపూడి మూవీ ఆ సినిమాకు రీమేకా?.. సీక్రెట్ రివీల్ చేసిన కీర్తి సురేష్!

ఇక కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా శ్రీలీల చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్త చిత్రాలకు సైన్ చేశారు. దిలేర్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ సరసన నటిస్తున్నారు.అలాగే.. కార్తీక్ ఆర్యన్ హీరోగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామాలో కూడా శ్రీలీల నటిస్తున్నారు.

Read more about: sreeleela tollywood marriage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X