వెంకీ- అనిల్ రావిపూడి మూవీ ఆ సినిమాకు రీమేకా?.. సీక్రెట్ రివీల్ చేసిన కీర్తి సురేష్!
టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడు, కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్, వరుస విజయాలతో దూసుకపోతున్న మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన మార్కు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో దిట్టా. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో 'మనశంకర వరప్రసాద్ గారు' సినిమాతో సంక్రాంతి బరిలో దిగి, బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ జోష్ ను అలాగే కొనసాగిస్తూ.. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాపై పలు రూమర్స్ వస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ హీరోయిన్ కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?
టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోకు ప్రత్యేకత ఉంది. గతంలో ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ ను అలరిసించింది. ఇప్పడు ఆ సక్సెస్ పుల్ కాంబో మరోసారి రీపిట్ కాబోతుంది. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఐదో సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాత్కాలికంగా #VenkyAnil5 పేరుతో ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో #NKRAR2 అనే హ్యాష్‌ట్యాగ్ కూడా వైరల్ అవుతోంది. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.

అయితే సినిమా ప్రకటించిన నాటి నుంచి దీనిపై రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా 2024లో విడుదలై మలయాళంలో ఘన విజయం సాధించిన 'గురువాయూర్ అంబలనాదయిల్' సినిమాకు రీమేక్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పెళ్లి నేపథ్యంలో సాగే ఆ హిలేరియస్ కామెడీ డ్రామా కథకు, అనిల్ రావిపూడి స్టైల్‌కు దగ్గర పోలికలు ఉండటంతో చాలామంది ఈ వార్తను నిజమేనని నమ్మడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
ఈ రూమర్లకు తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక మీమ్‌లో "వెంకీ-అనిల్ సినిమా గురువాయూర్ అంబలనాదయిల్ రీమేక్" అని పేర్కొనగా, ఆ పోస్టును చూసిన కీర్తి తన అధికారిక అకౌంట్ ద్వారా స్పందించారు. "నో ఇట్స్ నాట్" (No, It's Not!) అంటూ నవ్వుతున్న ఎమోజీతో కామెంట్ చేశారు. ఆమె చేసిన ఈ ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీమేక్ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఆ ప్రచారానికి తెరపడినట్టు అయింది. ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా రీమేక్ కాదు, ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా అని తేలిపోయింది.
ఈ కథను పూర్తిగా అనిల్ రావిపూడి స్వయంగా రాసుకున్నారట. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ అంశాలన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం.అంతేకాదు, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల కలయికలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు ఇద్దరు స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. c


Click it and Unblock the Notifications




