Telugu » Movies » 1 Nenokkadine » Story

1 నేనొక్కడినే (U/A)

సినిమా శైలి

Action, Romance

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

14 Jan 2014
కథ

1 నేనొక్కడినే సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కృతిసన, నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య మరియు మాస్టర్ గౌతమ్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్ నిర్వహించారు మరియు 14 రీల్స్,  ఈరోస్ ఇంటర్నేషనల్  పథాకం పై నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీ ల్ సుంకర నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ 

గౌతమ్(మహేష్)...చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోతాడు. తన తల్లి తండ్రులను ముగ్గురు చంపారని గుర్తుపెట్టుకుంటాడు..కాని వాళ్లు ఎవరు..ఎందుకు చంపారు అనేది మాత్రం తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. తన తల్లి తండ్రుల ముఖాలు మర్చిపోతాడు కానీ వారిని చంపిన వారిని మాత్రం ప్రతీ క్షణం తలుచుకుంటూ రాక్ స్టార్ గా ఎదుగుతాడు. ఎదుగుదలతో పాటు తన తల్లి తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పెరిగి పెద్దవుతుంది...అంతేకాదు..వారిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతినిపై దాడులు మొదలువుతాయి..ఈ క్రమంలో గౌతమ్ తల్లి తండ్రులు ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు..తన పగ ఎలా తీర్చుకున్నాడనేది మిగతా కథ.
స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు