X
తెలుగు » సినిమాలు » 1 నేనొక్కడినే
1 నేనొక్కడినే

1 నేనొక్కడినే

Action | Romance | 14 Jan 2014 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

1 నేనొక్కడినే స్టోరీ

1 నేనొక్కడినే సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కృతిసన, నాజర్, ప్రదీప్ రావత్, కెల్లీ డోర్జి, షాయాజీ షిండే, శ్రీనివాసరెడ్డి, పోసాని కృష్ణమురళి, సూర్య, బెనర్జి, చైతన్య మరియు మాస్టర్ గౌతమ్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్ నిర్వహించారు మరియు 14 రీల్స్,  ఈరోస్ ఇంటర్నేషనల్  పథాకం పై నిర్మాతలు:రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీ ల్ సుంకర నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ  గౌతమ్(మహేష్)...చిన్నప్పుడే తల్లితండ్రులను కోల్పోతాడు. తన తల్లి తండ్రులను ముగ్గురు చంపారని గుర్తుపెట్టుకుంటాడు..కాని వాళ్లు ఎవరు..ఎందుకు చంపారు అనేది మాత్రం తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. తన తల్లి తండ్రుల ముఖాలు మర్చిపోతాడు కానీ వారిని చంపిన వారిని మాత్రం ప్రతీ క్షణం తలుచుకుంటూ రాక్ స్టార్ గా ఎదుగుతాడు. ఎదుగుదలతో పాటు తన తల్లి తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పెరిగి పెద్దవుతుంది...అంతేకాదు..వారిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతినిపై దాడులు మొదలువుతాయి..ఈ క్రమంలో గౌతమ్ తల్లి తండ్రులు ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు..తన పగ ఎలా తీర్చుకున్నాడనేది మిగతా కథ.
Read More

1 నేనొక్కడినే కాస్ట్ & క్రూ

1 నేనొక్కడినే సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుకుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత అచంట రాము, అచంట గోపినాథ్, అనిల్ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

1 నేనొక్కడినే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
టెక్నికల్ గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్ లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే విభిన్నతే విజయానికి మూలం అని నమ్మిన సుకుమార్..ఇక్కడ మన వాళ్ల టేస్ట్ ఎందుకనో మర్చిపోయారు . ముఖ్యంగా ఇలాంటి కథలు ఏ ఇమేజీ లేని హీరోల మీద తీస్తే...చూడటానికి బాగుంటాయి. మహేష్ బాబు సినిమా అంటే కామెడీ, యాక్షన్,మోతిక్కించే పాటలు, జోష్ గా తెరపై చెలరేగే హీరో అని ఫిక్సయిన వారికి చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ హీరో ...ఎంతసేపు తన గతం తవ్వుకుంటూ, విలన్స్ నుంచి తనను తాను రక్షించుకుంటూ తిరగటమే సరిపోతుంది తప్ప..విలన్స్ కి ఎదురు ట్విస్ట్ లు ఇచ్చే ఎలిమెంట్స్ ఈ కథలో బాగా తక్కువ ఉన్నాయి. అసలు విలన్ ఎవరో తెలిస్తేనే కదా వారిపై దాడికి దిగేది ..అది క్లైమాక్స్ దాకా తెలియదు...అందులోనూ కథని థ్రిల్లింగ్ చెప్పాలనే తాపత్రయంలో కొంత కన్ఫూజన్ కి గురి అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ దాటాక అయితే మరీను. ఫస్టాఫ్ ని ...ఎంతో పగడ్బందీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్ ని ఆ ఫేజ్ లో రన్ చేయలేకపోయాడు.

1 నేనొక్కడినే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

1 నేనొక్కడినే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+