Telugu » Movies » 100 Days Of Love » Story

100 డేస్ ఆఫ్ లవ్ (U)

సినిమా శైలి

Romance

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

26 Aug 2016
కథ
100 డేస్ ఆఫ్ లవ్ సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్, డి జె శేఖర్ మీనన్, వినీత్, ప్రవీన, అజు వర్జీస్, రాహుల్ మాధవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీనస్ మహ్మాద్ నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వెంకటరత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గోవింద్ మీనన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

గోపాల్ (దుల్కర్ సల్మాన్) ఇంగ్లిష్ డైలాలో ఓ ఫీచర్ రైటర్‌గా పనిచేస్తూంటాడు. సంపన్న కుటుంబానికి చెందిన వాడే అయినా తల్లిదండ్రుల చెప్పినట్లు ఉండటం ఇష్టం లేని అతడు వాళ్లకు వచ్చి తనకు నచ్చినట్లు జీవితస్తుంటాడు. కామిక్ కార్టూనిస్టు కావాలన్నది లక్ష్యం. అయితే అతని స్వభావ రీత్యా ఉద్యోగాన్ని కాపాడు కోవడానికి చాలా శ్రమిస్తుంటాడు...కెరీర్ అస్తవ్యస్తంగా ఉన్న అతడు రోడ్డు మీద అనుకోకుండా తనకు కనిపించి మాయమైన సావిత్రి (నిత్యా మీనన్)ని తొలి చూపులోనే ప్రేమస్తాడు. ఆమె కెమెరా పట్టుకుని తన కోసం అన్వేషిస్తుంటాడు. సావిత్రి విషయానికొస్తే.... తనను ఇష్టంగా చూసుకునే వ్యక్తితో ఓ సెక్యూర్డ్ లైఫ్ కోరుకునే మనస్తత్వం. కొంత కాలం తర్వాత సావిత్రి గోపాల్ కు ఎదురు పడుతుంది కానీ అప్పటికే మరొకరితో ఆమెకు ఎంగేజ్మెంట్ అవుతుంది. మరి అప్పుడు గోపాల్ ఏం చేసాడు? రెండు భిన్న మనస్తత్వాలు ఉన్న వీరిద్దరు కలిసారా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే...


స్పాట్ లైట్ లో ఉన్న సినిమాలు