X
100% లవ్
Romance | 06 May 2011 | U |
Telugu

100% లవ్ స్టోరీ

100% లవ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, తమన్నా, తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.

కథ

మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+