X
100% లవ్

100% లవ్

Romance | 06 May 2011 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

100% లవ్ స్టోరీ

100% లవ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, తమన్నా , తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే.
Read More

100% లవ్ కాస్ట్ & క్రూ

100% లవ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుకుమార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

100% లవ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ స్క్రిప్టు తయారుచేసుకుని ఈ సారి తాను కన్ఫూజ్ కాకుండా ప్రేక్షకుడ్ని కన్ఫూజ్ కాకుండా కాపాడాడు. అలాగే తన స్పెషలైజేషన్ అయిన క్యారెక్టర్ డ్రైవన్ ఫిల్మ్ గానూ మరో ప్రక్క ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆయన అభిమానులును సంతృప్తి పరిచాడు. ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ వద్ద నాగచైతన్య బరస్ట్ అయ్యి తన ప్రేమను వ్యక్తం చేసే సీన్ చాలా బాగా వచ్చింది. హీరో తాతగా చేసిన విజయ్ కుమార్ పాత్ర బాగా కథలో కలిసి క్లైమాక్స్ కు లీడ్ చేయటం చాలా బాగా వచ్చింది. ఆయన పాత్ర కథలో కీలకమవ్వటం సుకుమార్ స్క్రిప్టుపై చేసిన కసరత్తు ఫలితమే అనిపిస్తుంది. అంతేగాక హీరో పాత్ర చివరదాకా తన క్యారెక్టేరషన్ ని వదలకుండా నిలబెట్టడం కూడా బాగా నచ్చే అంశం.

100% లవ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

100% లవ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+