1997 సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో డాక్టర్ మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్ వహించారు. నిర్మాత: మీనాక్షి రమావత్ నిర్మించారు. సంగీతం కోటి అందించారు.
కథ
దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్ సాధించిన విక్రమ్ రాథోడ్ (డాక్టర్ మోహన్) నిజాంపేట్‌లో ఏసీపీగా నియమితులవుతారు. ఏసీపీగా చేరిన ప్రాంతాన్ని దొర ( రామరాజు) తన కనుసన్నల్లో ఉంచుకొంటాడు. అయితే ఆ ప్రాంతంలో ఇద్దరు గిరిజన యువతులు గంగ, మంగ కిడ్నాప్ గురి అవుతారు. కానీ వారిలో ఒకరు దారుణ హత్యకు గురవుతుంది. అయితే గంగ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నంగా చేస్తారు. దొర కనుసన్నల్లో జరిగే కుట్ర సీఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్) భాగమవుతాడు. కిడ్నాప్ గురైన గంగ హత్య గురికావడం వెనుక ఏమి జరిగింది? దొర ఎందుకు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దొరను విచారించడానికి, ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రయత్నించిన ఏసీపీ విక్రమ్ రాథోడ్‌కు ఎదురైన సమస్యలు ఏమిటి? కిడ్నాప్ గురైన మంగ పరిస్థితి ఏమిటి? గంగ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషులు ఎవరు? వారికి శిక్ష పడిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 1997 చిత్ర కథ.