twitter

    47 డేస్ స్టోరి

    47 రోజులు సినిమా మిస్ట్రీ, రోమాంటిక్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, పూజ జవేరి, రోషిని, సత్య ప్రకాష్, హరి తేజ, రవి వర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ మద్దాలి వహించారు మరియు నిర్మాతలు దబ్బర శశి, భూషన్ నాయిడు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు. 

    కథ

    వైజాగ్‌లో ఏసీపీగా పనిచేసే సత్య (సత్యదేవ్) ఆరు నెలల సస్పెన్షన్‌లో ఉంటారు. తన భార్య పద్దు (రోషిణి ప్రకాశ్) సూసైడ్ విషాదంతో బాధపడుతూ.. ఆమె మరణం వెనుక కారణాలను అన్వేషిస్తుంటాడు. అదే సమయంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ రెండు మరణాలకు పోలీకలు ఉండటంతో అధికారులు దృష్టికి తీసుకెళ్తాడు. అయితే అప్పటికే ఆ కేసు ఫైల్స్ మూసి వేయడం వల్ల దర్యాప్త చేయడానికి పోలీసు కమిషనర్ నిరాకరిస్తారు. అయితే తన ప్రయత్నాలను మానుకోకుండా రాజారాం అనే హెడ్ కానిస్టేబుల్‌ సహాయంతో దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో జూలియట్ (పూజా జవేరి) అనే యువతి ఈ దర్యాప్తులో కీలకంగా మారుతుంది. తన భార్య పద్దు మరణానికి అసలు కారణమేమిటి? అదే క్రమంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు మృతి వెనుక వాస్తవాలు ఏమిటి? సత్య దర్యాప్తులో తన స్నేహితుడు, పోలీస్ ఆఫీసర్ రవి (రవి వర్మ) ఎలాంటి పాత్ర పోషించాడు? ఇక రాజారాం హెడ్ కానిస్టేబుల్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలాంటి సహకారం అందించారు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు జరిగిన రెండు మరణాలు లింక్ ఏమైనా ఉందా? జూలియట్ ఈ దర్యాప్తులో ఎంత వరకు ఉపయోగపడిందనే చిక్కు ముడులకు సమాధానమే 47 డేస్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie 47 డేస్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X